దివ్వెల మాధురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఆమె తనతో ఉంటే ఎప్పుడూ సర్‌ప్రైజ్‌గానే ఉంటుందని, తాను పడిపోయినప్పుడు తన వెంటే ఉందని తెలిపారు.
దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జోడీ సోషల్ మీడియాలో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు ఆదర్శ జంటగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరి గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తరచూ ఈ ఇద్దరు యూట్యూబ్ ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చాటుకున్నారు. దివ్వెల మాధురిపై శ్రీనివాస్ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. దెబ్బకి మాధురి కన్నీళ్లు పెట్టుకుంది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాధురి గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ, తను తరచూ సర్‌ప్రైజ్ చేస్తుందని తెలిపారు. బ్రాస్లెట్, వాచ్‌లు, కార్లు ఇలాంటి గిఫ్ట్ లు ఇస్తుందని, నిత్యం ఏదో రకంగా సర్‌ప్రైజ్ చేస్తుందని తెలిపారు. అంతేకాదు ఇవ్వన్నీ ఇవ్వడం కాదు, మాధురి తన లైఫ్‌లోకి రావడమే పెద్ద సర్‌ప్రైజ్ అని తెలిపారు శ్రీనివాస్. ఆమె తనతో ఉండటమనేదే తనకు సర్‌ప్రైజ్ అనిపిస్తుందని వెల్లడించారు. మాధురి తనతో ఉంటే ప్రతి నిమిషం తాను గొప్పగానే ఫీలవుతానని తెలిపారు. నేను ఎక్కడైతే పడిపోయానో, అక్కడి నుంచే లేవాలని చెప్పి, ఎంతో అండగా నిలిచి, అన్ని రకాలుగా అండదండలు అందించిందని చెప్పారు. తాను మళ్లీ గొప్ప స్థాయికి రావాలని ప్రతి నిమిషం కోరుకుంటుందని, అదే తనకు గ్రేట్ సర్‌ప్రైజ్ అని చెప్పారు శ్రీనివాస్.
35
దివ్వెల మాధురి కన్నీళ్లు
శ్రీనివాస్ మాటలకు మాధురి ఎమోషనల్ అయ్యింది. ఇంటర్వ్యూలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా మాధురికి మరో హామీ ఇచ్చారు శ్రీనివాస్. ఆయన కట్టేకాలే వరకు నవ్వే నాతో ఉంటావని, నీనే నీతో ఉంటానని, ఇందులో తేడా లేదని, మనల్ని ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు. బతికున్నంత వరకు కలిసే ఉంటామని చెప్పారు. దీనికి కూడా మాధురి ఎమోషనల్ అయ్యింది.
ఈ సందర్భంగా మాధురికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఆమె కోపంలో కంట్రోల్ తప్పుతుందని, ఆలోచించకుండ మాట్లాడుతుందని, ఎక్స్ ట్రీమ్‌కి వెళ్లిపోతుందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే మనిషి కంట్రోల్‌గా ఉండాలని, ఆగి ఆలోచించాలని తెలిపారు. అందరితోనూ బాగుండాలని, ఎవరినీ హర్ట్ చేయోద్దని వెల్లడించారు. కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటివి మానుకోవాలని తెలిపారు శ్రీనివాస్. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు దువ్వాడ శ్రీనివాస్.
దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా, ఎంఎల్‌సీగా పనిచేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. వైఎస్ జగన్‌ని ఎంతో ఆరాధిస్తుంటారు. అలాగే మాధురి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుని సంచలనంగా మారింది. బిగ్ బాస్ తెలుగు 9లోకి వెళ్లొచ్చి సెలబ్రిటీగా మారిపోయింది. మరోవైపు విజయవంతంగా బట్టల వ్యాపారం చేస్తోంది.