టాలీవుడ్ నెంబర్ హీరోయిన్ ఎవరో తేల్చేశారు ప్రేక్షకులు. తాజా సర్వేలలో ఊహించని ఫలితం వచ్చింది. రష్మిక మందాన, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కి షాక్ తగిలింది.
ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మరి ఎవరి ర్యాంక్ హైయెస్ట్? ఎవరి ర్యాంక్ లోయెస్ట్? అనేది చూద్దాం...
211
ప్రేక్షకులు కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి 10వ స్థానం ఇచ్చారు. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ అమ్మడుకి టాప్ టెన్ లో చోటు దక్కింది.
311
పూజా హెగ్డే 9వ ర్యాంక్ కి పడిపోవడం అనూహ్య పరిణామం. పూజ హెగ్డే తెలుగులో నటించి రెండేళ్లు కావస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఆమె ఫేమ్ పడిపోయింది.
411
ప్రస్తుతం ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె 8వ స్థానంతో సరిపెట్టుకోవడం అనూహ్య పరిణామం. గత ఏడాది కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది.
511
మిల్కీ బ్యూటీ తమన్నాకు 7వ స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి.
611
రష్మిక మందాన కనీసం టాప్ 5లో లేకపోవడం అనూహ్య పరిణామం. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందాన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. ఆమెకు 6వ స్థానం దక్కింది.
711
సాయి పల్లవి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్నా ఆమె ఫేమ్ తగ్గలేదని అర్థం అవుతుంది. పూజా హెగ్డే, కీర్తి సురేష్, రష్మిక మందాన కంటే ఆమె మెరుగైన రాంక్ సాధించింది. 5వ స్థానంలో నిలిచింది.
811
కన్నడ భామ శ్రీలీల 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆమె ఖాతాలో ప్లాప్స్ ఎక్కువగా ఉన్నా యూత్ లో క్రేజ్ తగ్గలేదు. టాప్ 5లో చోటు దక్కించుకుంది.
911
Anushka Shetty
ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలైంది. అనుష్క ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంది.
1011
పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. ఫార్మ్ లో లేని కాజల్ కి జనాలు 2వ స్థానం కట్టబెట్టారు.
1111
Tollywood top 10 Heroines
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కిరీటం సమంతకు దక్కింది. నిజానికి సమంత కూడా ఫార్మ్ లో లేరు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. ఖుషి, శాకుంతలం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా... సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని జనాలు కన్ఫర్మ్ చేశారు.