పూజా హెగ్డేకి మరో బంపర్‌ ఆఫర్‌.. సౌత్‌ స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్.. దశ తిరిగినట్టే?

Published : May 17, 2024, 07:24 PM ISTUpdated : May 17, 2024, 07:26 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డేకి తెలుగులో ఆఫర్లు లేవు. ఆమెకి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు కానీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ అందుకుందట.   

PREV
18
పూజా హెగ్డేకి మరో బంపర్‌ ఆఫర్‌.. సౌత్‌ స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్.. దశ తిరిగినట్టే?

టాలీవుడ్‌ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకి ఇటీవల సరైన ఆఫర్లు లేవు. అదిగో, ఇదిగో అందులో ఆఫర్‌, ఇందులో ఆఫర్‌ అనే వార్తలే తప్ప, అధికారికంగా ఓకే అయ్యింది ఇప్పటి వరకు లేదు. ఈ నేపథ్యంలో ఓ కొత్త వార్త వినిపిస్తుంది. ఆమెకి, ఆమె అభిమానులకు ఖుషీ చేసే వార్త వైరల్‌ అవుతుంది. కోలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ అందుకుంది పూజా హెగ్డే. 
 

28

బుట్టబొమ్మ కెరీర్‌ కోలీవుడ్‌తోనే ప్రారంభమైంది. ఆమె మొదటి సినిమా అక్కడే చేసింది. జీవాతో కలిసి నటించింది. ఆ మూవీ పెద్దగా ఆకట్టకోలేదు. అనంతరం `ఒక లైకా కోసం`, `ముకుందా` కోసం టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రాలతోనే ఆకట్టుకుంది. సినిమాలు పెద్దగా ఆడకపోయినా పూజాని తెలుగు ఆడియెన్స్ ఆదరించారు. కానీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బుట్టబొమ్మ. అక్కడ హృతిక్‌తో `మోయింజోదారో` చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆడలేదు. 
 

38

ఇలా మూడు ఇండస్ట్రీలోన పూజాకి సక్సెస్‌ దక్కలేదు. దీంతో కొంత గ్యాప్‌ వచ్చింది. అనంతరం బన్నీ లైఫ్‌ ఇచ్చాడు. `డీజే` మూవీతో మళ్లీ తెలుగుకి తీసుకొచ్చారు. ఈ సినిమాబాగానే ఆడింది. ఈ చిత్రంతో పూజా పాపులర్‌ అయ్యింది. దీంతో ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో బిగ్‌ స్టార్స్ తో ఆఫర్లని అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. గోల్డెన్‌ లెగ్‌గానూ, లక్కీ హీరోయిన్‌గానూ మేకర్స్ ప్రకటించేంతగా ఆమె నటించిన చిత్రాలు సక్సెస్‌ కావడం విశేషం. 
 

48

ఈ క్రమంలో పదేళ్లకి కోలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చింది పూజా. విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటించింది. కానీ ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఆ సమయంలో పూజా నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `ఆచార్య`, హిందీ సినిమాలు కూడా పరాజయం చెందాయి. అంతే ఎంత స్టార్‌గా ఎదిగిందో ఒకేసారి పడిపోయింది. ఆర్నెళ్ల వ్యవధిలోనే పూజా కెరీర్‌ తలక్రిందులైంది. 
 

58

`గుంటూరు కారం`లో ఆఫర్‌ కోల్పోయింది. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఆఫర్‌ పోయింది. సాయిధరమ్‌ తేజ్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. ఇలా అన్నీ దారులు మూసుకుపోయాయి. హిందీలోనూ రెండు సినిమాలు చేసింది. ఆ రెండూ డిజాస్టర్‌ అయ్యాయి. ఇలా ఒకేసారి జీరో అయ్యింది పూజా.  

68

ఏడాదిపాటు ఆమెకి సినిమాలు లేవనే చెప్పాలి. బాలీవుడ్‌లో ఓ మూవీ చేస్తుంది. `దేవా` అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు అదిగో ఆఫర్లు, ఇదిగో ఆఫర్లు అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె మరో కోలీవుడ్‌ ఆఫర్‌ అందుకుందట. సూర్యతో జోడీగా నటించే ఛాన్స్ వరించినట్టు తెలుస్తుంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు సూర్య. తన 44వ చిత్రంగా ఇది రూపొందుతుంది. ఇందులో హీరోయిన్‌గా పూజాని ఫైనల్‌ చేశారట. ప్రస్తుతం ఆ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. 
 

78

`సూర్య 44` షూటింగ్ జూన్ 2న అండమాన్ దీవులలో ప్రారంభమవుతుంది. అండమాన్ దీవులు, ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసింది టీమ్‌. ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం  అందిస్తున్నారు. 
 

88

ఇదిలా ఉంటే పూజా హెగ్డే `దేవర` లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే `టిల్లు క్యూబ్‌` సినిమా కూడా రాబోతుంది. `టిల్లు స్వ్కెర్‌`కి మరో సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఈ సారి పూజాని తీసుకోవాలనుకుంటున్నారట. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇవన్నీ నిజంగానే వస్తే పూజా హెగ్డే దశ తిరిగిందనే చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories