రోజాకు జబర్థస్త్ లో నో ఛాన్స్.... సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి..? ఏం చేయబోతుంది..?

First Published | Aug 6, 2024, 4:45 PM IST

రోజా రాజకీయాలకు స్వస్థి చెప్పబోతోందా..? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా..? తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు వస్తాయా..? జబర్థస్త్ కు రోజా ప్రయత్నాలు చేసిందా...? 

roja

వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో... నటి, పొలిటీషియన్ రోజా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఎప్పుడు మైక్ కనిపించినా.. పూనకం వచ్చినట్టు ఊగిపోయే ఆమె.. ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించడంలేదు. ఏమైపోయిందో కూడా తెలియడంలేదు. జగన్ నిర్వహించే సమావేశాలు ధర్నాలు లాంటి కార్యక్రమాలకు కూడా ఆమె రావడంలేదు. దాంతో ఆమె రాజకీయాలు వదిలేస్తున్నారా అన్న అనుమానం జనాల్లో కలుగుతుంది...?

కీర్తి సురేష్ ఇంటికి పెళ్ళి ప్రపోజల్ తో వచ్చిన అభిమాని.. మహానటి ఏం చేసిందో తెలుసా..?

Roja Selvamani

ఇకఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రోజా.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. తన పార్టీవారే తనను పనికట్టుకుని ఓడించారన్న కోపంతో ఉన్న రోజ.. వైసీపీపై కోపంగా ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆమె మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తుందన్న సమాచారం అందుతోంది.


jabardasth show

అయితే టాలీవుడ్ లోకి రావడానికి ఆమెకు ఛాన్స్ లేనట్టే సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పాటు.. మెగా ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై అభిమానులతో.. ఇండస్ట్రీ వారు కూడా కోపంగా ఉన్నారు. 
 

ఇక తన భర్త తమిళ నిర్మాత కావడం.. అక్కడ ఆయన పలుకుబడి ఉపయోగించి కొన్ని సినిమాలు ఆమె కమిట్ అయినట్టు సమాచారం. తెలుగలో అవకాశాలు ఉంటాయన్న నమ్మకం లేకపోవడంతో.. తమిళ సినిమా,టీవీ రంగాలపై రోజ దృష్టిపెట్టిందట. ఇటు  తెలుగులో జబర్థస్త్ కామెడీ షోకు సుధీర్ఘకాలం జడ్జిగా పనిచేశారు రోజా.. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ షోను వదిలిపెట్టలేదు. కాని మినిస్టర్ అయిన తరువాత రూల్స్ ఒప్పుకోకపోవడంతో జబర్థస్త్ ను వీడక తప్పలేదు. 

ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన రోజా.. జబర్థస్త్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం  కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే మల్లెమాల వారు రోజాను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదన్న టాక్ వినిపిస్తోంది. దాంతో తమిళంలో రెండు టీవీ ప్రోగ్రామ్స్ కు ఆమె హోస్ట్ గా చేయబోతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇటు కన్నడాలో కూడా టీవీ షోస్ కు ఆమె రెడీ అవుతున్నారట. 

తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ ను దారుణంగా అవమానించారు వైసీపీ లీడర్స్. అందులో రోజా కూడా ఉండటంతో.. తమిళంలో కూడా రోజాకు ముందు ముందు కెరీర్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అసలు రోజా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమా.. లేక రాజకీయాల్లోనే కొనసాగుతుందా చూడాలి. నగిరిలో ఆమెకు వ్యతిరేకత ఉండటంతో.. వేరే ప్రాంతానికి వెళ్తుందా.. లేక రాజకీయాలు వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!