Shanto Khan
కల్లోల బంగ్లాలో అరాచక ఉదంతాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వేలాది మంది ఆందోళకారులు రోడ్ల మీదకు వచ్చి విద్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రధానమంత్రి.. చీఫ్ జస్టిస్ నివాసాల్ని మాత్రమే కాదు.. పార్లమెంట్ భవనంలోనూ ధ్వంసకాండ సాగింది. కేవలం రాజకీయ నాయకుల్నే కాదు.. వివిధ రంగాలకు చెందిన పలువురిని ఆందోళనాకారులు టార్గెట్ చేయటం.. కొందరిని హతమార్చటం లాంటి అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఆ అరాచక ఘటనల్ని చూసి ప్రపంచం విస్తుపోతోంది.
Shanto Khan
తాజాగా చాంద్‌పూర్ జిల్లా బగారాబజార్‌లో ఉంటున్న బంగ్లా నటుడు శాంటోఖాన్, అతని తండ్రి, సహ-నిర్మాత సెలీంఖాన్‌ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థుల గుంపు ఇంటిని తగులబెట్టేందుకు రాగా.. వీరు తుపాకీతో కాల్పులు జరిపి, అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టి, కర్రలతో కొట్టి, హతమార్చారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ గ్రూప్ బంగ్లా చలన చిత్ర అనేక పోస్ట్ లతో ఖరారు చేసింది.
Shanto Khan
సెలీం ఖాన్ కు శిల్పా మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ బ్యానర్ పై చాలా సినిమాలు నిర్మించారు. అందులో ఎక్కువ భాగం హిట్ అయ్యాయి. షెహన్షా, భిరోధి వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అతను స్వయంగా తుంగీ ప్యార్ మియా భాయ్ అనే సినిమా కూడా నిర్మించి ,డైరక్ట్ చేసారు.
Shanto Khan
తన కొడుకు శాంటో ఖాన్ ని హీరోగా లాంచ్ చేసి ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి తీసుకు వస్తున్నారు. అయితే ఆయనపై చాలా అవినీతి కేసులు ఉన్నాయి. కొన్నాళ్లు జైలుకు వెళ్లి వచ్చారు కూడా. అయితే ఇంత స్దాయిలో కొట్టి చంపే అంత వ్యతిరేకత వారిపై ఉందని ఎవరూ ఊహించలేదు.
Shanto Khan
బంగ్లాదేశ్ చిత్రాల్లో హీరోగా నటిస్తూంటాడు హీరో శాంటోఖాన్. అతని తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఆందోళనల్లో భాగంగా చాంద్ పూర్ జిల్లా బగారాబజార్ లో ఉంటున్న అతని ఇంటి వద్దకు వచ్చి.. ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళన కారులు ఈ ఇంటిని చుట్టుముట్టి.. వీరిని కర్రలతో కొట్టి చంపేశారు.
Shanto Khan
ఇక బంగ్లాలో ప్రధాని అధికారిక నివాసం సహా.. అధికార అవామీ పార్టీ నేతల ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. మీడియా కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. అధికారపక్షానికి మద్దతిచ్చే వ్యాపారుల దుకాణాలు, పరిశ్రమలు లూటీ అయ్యాయి. దాంతో ఢాకా సహా.. దేశంలోని ప్రధాన నగరాలు నిప్పుల కుంపటిగా మారిపోయాయి.