కీర్తి సురేష్ ఇంటికి పెళ్ళి ప్రపోజల్ తో వచ్చిన అభిమాని.. మహానటి ఏం చేసిందో తెలుసా..?

First Published | Aug 6, 2024, 3:31 PM IST

ఈమధ్య సినిమాల కంటే.. పెళ్ళి వార్తల్లో ఎక్కువగా హైలెట్ అవుతోంది కీర్తి సురేష్. ఇదిగో పెళ్ళి అంటే..అదిగో ప్రేమా అంటూ మహానటిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో కీర్తి సురేష్ ఇంటికి పెళ్ళి ప్రపోజల్ తో వెళ్ళాడట ఓ వ్యక్తి. 
 

కీర్తి సురేష్ పెళ్ళి వార్తలు ఎక్కువైపోయాయి ఈమధ్య. క్రికెటర్ ను ప్రేమించిందని ఒకసారి, అనిరుధ్ తో పెళ్ళి అని మరోసారి.. నిర్మాతను పెళ్ళాడబోతుందని ఇంకోసారి.. తన చిన్నాటి స్నేహితుడితో కీర్తి పెళ్లంటూ.. రకరకాల వార్తలను వండేస్తుంది సోషల్ మీడియా. అయితే ఈ వార్తల విషయంలో కీర్తి సురేష్ ఒ మారు క్లారిటీ కూడా ఇచ్చారు. 

ప్రస్తుతం తన దృష్టి సినిమాల మీదనే ఉంటుందని. పెళ్ళి ప్రస్తావన లేదన్నారు. కెరీర్ పై దృష్టిపెడతానని.. పెళ్లి చేసుకునే టైమ్ వస్తే.. తాను ముందుగానే అనౌన్స్ చేస్తానన్నారు కీర్తి.  ఇక  సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ చెప్పేసింది. ఇక నెట్టింట ఎవరేమనకున్నా.. లైట్ తీసుకుంటుందని ఇప్పటికే అర్ధం అయ్యింది. 
 


కాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్ళివార్త వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? కీర్తి సురేష్ తాజాగా తనకొచ్చిన ఓ లవ్ ప్రపోజ్ గురించి చెప్పుకొచ్చింది. నన్ను అభిమానించే ఒక వ్యక్తి నా ఇంటికి డైరెక్ట్ గా వచ్చేశాడు. ఉత్తగ రాలేదు.. పెళ్లి చేసుకుంటానని  ప్రపోజల్ తో  వచ్చాడు. చెప్పాడు కూడా . అతన్ని చూసి ముందు భయపడ్డా కానీ, తర్వాత అతను నాపై చూపించే అభిమానం ప్రేమ నచ్చాయి అన్నారు కీర్తి.

ఇక సినిమా నటీనటులు.. ఎవరైనా. తాము ఎంతో కష్టపడి ఆడియన్స్ ను అలరిస్తుంటాము. అటువంటి టైమ్ లో ఇలాంటి అభిమానులు తమ ప్రేమను ఇలా కురిపిస్తే.. మా కష్టాలు మర్చిపోతాము అన్నారు కీర్తి. ఈ ప్రేమ  కోసం ఎంత కష్టపడినా పర్వాలేదని అనిపిస్తుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
 

ఇక ఆమధ్య వరకూ వరుస సినిమాలతో దూసుకుపోయిన కీర్తి సురేష్‌.. ఈ మధ్య కాస్త రేసులో వెనకపడింది. ఆమధ్య  దసరా' సినిమాలో వెన్నెల పాత్రకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించిన కీర్తి సురేష్..  తరువాత భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటించింది కీర్తి. 
 

Latest Videos

click me!