Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ ని నయనతార ప్రారంభించారు. లేటెస్ట్ వీడియో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. అనిల్ రావిపూడి తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా క్రేజీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారు.
25
అనిల్ రావిపూడి ప్రమోషన్స్
తన స్ట్రాటజీతో గతేడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ వంతు వచ్చింది. రిలీజ్ కి రెండు వారాల సమయం కూడా లేదు. దీనితో ఈ చిత్ర ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నయనతార డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు అభిమానులు కూడా షాకయ్యే సర్ప్రైజ్ ఇచ్చింది.
35
తన రూల్ పక్కన పెట్టిన నయనతార
సాధారణంగా నయనతార ఎంత పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ కి హాజరు కారు. అది నయనతార తనకు తాను పెట్టుకున్న నిబంధన. కానీ నయనతార చిరంజీవి సినిమా కోసం తన రూల్ ని పక్కన పెట్టారు. ఈ సినిమా ప్రారంభం నుంచి ఆమె ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు టీం ఒక క్రేజీ వీడియో వదిలారు. ఈ వీడియోలో నయనతార తనంతట తానుగా వచ్చి ఏంటి అనిల్ సినిమా ప్రమోషన్స్ ఏమీ లేవా అని అడిగారు. దీనితో అనిల్ రావిపూడి కళ్ళు తిరిగి పడిపోవడం, క్రేజీ రియాక్షన్ ఇవ్వడం నవ్వులు పూయించేలా ఉంది.
55
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
మీ అంతట మీరు ప్రమోషన్స్ గురించి అడగడమే పెద్ద ప్రమోషన్. మీరు జస్ట్ సినిమా జనవరి 12న రిలీజ్ అని అనౌన్స్ చేయండి అని అనిల్ నయనతారని అడిగారు. దీనితో నయనతార.. చిరంజీవి స్టైల్ లో అమ్మా కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో.. ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడం వైరల్ అవుతోంది.