టీలో చక్కరేయాలో, ఉప్పు వేయాలో తెలియని రోజా.. ఇంటికెళ్లి ఇరుక్కుపోయిన `జబర్దస్త్` కమెడీయన్లు.. అయ్యో పాపం

Published : Feb 08, 2022, 08:41 AM IST

రోజా.. నటిగా, జబర్దస్త్ షోకి జడ్జ్ గా, నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా రోజా.. జబర్దస్త్ కమేడియన్లకి చుక్కలు చూపించింది. ఇంటికొచ్చిన హైపర్‌ ఆది టీమ్‌కి దారుణమైన అవమానం జరిగింది. ఆ వివరాలేంటో చూస్తే..   

PREV
17
టీలో చక్కరేయాలో, ఉప్పు వేయాలో తెలియని రోజా.. ఇంటికెళ్లి ఇరుక్కుపోయిన `జబర్దస్త్` కమెడీయన్లు.. అయ్యో పాపం

నటిగా సినిమాలకు చాలా రోజుల క్రితమే ఫుల్‌స్టాప్‌ పెట్టిన రోజా `జబర్దస్త్` కామెడీ షో ద్వారా ఆడియెన్స్ కి దగ్గరగానే ఉన్నారు. ఈ షోకి జడ్జ్ గా ఆమె తన హుందాతనంతో అలరిస్తున్నారు. పంచ్‌లో నవ్విస్తున్నారు. కెరీర్‌ పరంగా అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉండే రోజాకి ఇంటి పనులు రావనే విషయం తాజాగా బయటపడింది. ఇంటికొచ్చిన `జబర్దస్త్` కమెడీయన్లకి దారుణమైన అవమానం జరిగింది. 

27

`జబర్దస్త్` షోలో భాగంగా హోమ్‌ టూర్‌ నిర్వహించారు `హైపర్‌ ఆది` టీమ్‌. ఫస్ట్ టైమ్‌ హోమ్‌ టూర్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పి.. అందులో భాగంగా నగరి(ఏపీ)లోని రోజా ఇంటికెళ్లారు. ఇటీవల కొత్తగా కట్టిన ఇంట్లో రోజా ఫ్యామిలీ ఉంటోంది. ఎంతో లావిష్‌గా కట్టిన రోజా ఇళ్లు ఆకట్టుకుంటుంది. కనువిందు చేస్తుంది. అత్యాధునిక సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించినట్టు తాజాగా ఈ జబర్దస్త్ కమెడీయన్ల హోమ్‌ టూర్‌ వల్ల అర్థమవుతుంది. 

37

ఇదిలా ఉంటే రోజా ఇంటికెళ్లిన హైపర్‌ ఆది టీమ్‌.. బయటే ఉండి రోజా బయటకు రావాలని నినాదాలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తంగా వీరి అరుపులు విన్న రోజా డోర్‌ తెరిచి బయటకొచ్చింది. రావడంతోనే కరుస్తావా ఏంటీ అంటూ హైపర్‌ ఆదిపై పంచ్‌ వేసింది. మొదటగా తన ఇంట్లో ఎంట్రెన్స్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూపించి నమస్కారాలు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి అని హైపర్‌ ఆది అనగా, కృష్ణగారి కొడుకు మహేష్‌తో కలిసి యాక్ట్ చేయాలని ఉందని చెప్పింది రోజా. మనసులోని మాటని బయటపెట్టేసింది. 

47

దీనికి స్పందించిన ఆది.. రోజాపై పంచ్‌ వేశారు. కృష్ణ, రామా అని పాడుకోక ఎందుకండీ మనకు ఈ కృష్ణగారి కొడుకు.. అంటూ పంచ్‌ వేయడంతో సీరియస్‌గా లుక్‌ ఇచ్చిన రోజా.. ఆదికి పంచ్‌ ఇచ్చింది. ఆ తర్వాత డైరెక్ట్ గా కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడ రోజా పనిమనిషి ఆమెని చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ కిచెన్‌లోకి రాని మీరు ఇలా వచ్చారేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ రోజు నేను చేస్తా నువ్వు పదా అని చెప్పి వంటమనిషిని పంపించేసింది. 

57

అసలు కథ అప్పుడే స్టార్ట్ అయ్యింది. రోజా మాటలకు ఆదికి కళ్లు బైర్లు కమ్మాయి. ఎప్పుడూ కిచెన్‌లోకి రానంటోంది, ఈమేమో నేను వంట చేస్తానంటోంది అంటూ వేసిన పంచ్‌ నవ్వులు పూయించింది. అంతేకాదు `జబర్దస్త్` కమెడీయన్లని ఏకంగా కిచెన్‌లోకి తీసుకెళ్లి టీనే కదా మీరు అడిగిందని అనడం విశేషం. వారికి దారుణమైన అవమానం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు(సరదాగా). 

67

అంతటితో ఆగలేదు.. వంటమనిషి సాల్ట్ ఎక్కడ అని అడిగింది. టీ అన్నారు అని ఆది అనగా, సాల్ట్ వేయాలిగా అంటూ రోజా చెప్పిన సమాధానానికి ఆది మైండ్‌ బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత గ్యాస్‌ స్టౌవ్‌ వెలిగించి ఆనందం వ్యక్తంచేసింది రోజా. దీంతో ఆది స్పందిస్తూ ఏంటీ ఈమే స్టౌవ్‌ వెలిగించి ఒలంపిక్‌ జ్యోతిని వెలిగించినట్టు ఫీలవుతుందని పంచ్‌ వేయడం నవ్వులు పంచింది. ఎట్టకేలకు టీ పెట్టిన రోజా.. జబర్దస్త్ కమెడీయన్లకి ఇచ్చి.. టీ ఎలా ఉందని అడిగింది. దీనికి ఆది స్పందిస్తూ, బాగానే ఉంది మేడమ్‌ అంటూ.. అయితే టీ అయితే బాగుండూ అంటూ వేసిన పంచ్‌ మరింతగా కామెడీని పంచింది. 
 

77

ఆ తర్వాత రోజా భర్త, దర్శకుడు సెల్వమణి వచ్చి జబర్దస్త్ టీమ్‌కి నమస్కారం తెలిపారు. అనంతరం రోజా.. తన ఇంటిని మొత్తం వారికి చూపించింది. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. పూజాగది, బెడ్‌ రూమ్‌, హాల్‌, ఇతర రూమ్‌లను, టోటల్‌గా ఇంటిని మొత్తం చూపించింది.  లేటెస్ట్ గా విడుదలైన `జబర్దస్త్` ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మిగిలిన స్కిట్ల కంటే రోజా హోమ్‌ టూర్‌ బాగా నవ్వులు పంచడం విశేషం. ఈ గురువారం ప్రసారమయ్యే `జబర్దస్త్` షోలో రోజా హోమ్‌ టూర్‌కి సంబంధించి పూర్తి వీడియోని చూపించనున్నారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories