Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా

Published : Nov 02, 2026, 08:04 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 8వ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. సింగర్‌ ఝాన్సీతోపాటు రోహిత్‌ నాయుడు ఎలిమినేట్‌ అయ్యాడు. మరి ఆయన 8 వారాలకు ఎంత పారితోషికం అందుకుంటున్నాడనేది చూస్తే.

PREV
13
రోహిత్‌ నాయుడు ఎలిమినేషన్‌ పెద్ద రచ్చ

బిగ్‌ బాస్‌ తెలుగు 10.. 8వ వారం ఎలిమినేషన్‌ పెద్ద రచ్చ అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ చేసిన విషయం తెలిసిందే. మొదట సింగర్‌ ఝాన్సీని ఎలిమినేట్‌ చేశారు. ఆ తర్వాత హౌజ్‌ మేట్‌ ఓటింగ్‌తో రోహిత్ ని ఎలిమినేట్‌ చేశారు. ఆయన్ని సీక్రెట్‌ రూమ్‌కి పంపించాలనుకున్నారు. కానీ బిగ్‌ బాస్‌కి, నాగార్జునకి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు రోహిత్‌, తాను సీక్రెట్‌ రూమ్‌కి వెళ్లను, ఇంటికి వెళ్లిపోతానని వెల్లడించారు. ఈ విషయంలో అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద రచ్చ అయ్యిందట.

23
రోహిత్‌ ఎలిమినేషన్ పై ట్రోల్స్

రోహిత్‌ని కన్విన్స్ చేయడానికి అభిజిత్‌ని రంగంలోకి దించారు. ఆయనతో బుజ్జగించే ప్రయత్నం చేయించినా రోహిత్‌ వినలేదు. తనది అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని ఆయన హర్ట్ అయ్యాడట. దీంతో దానికి నిరసనగా పూర్తిగానే బయటకువెళ్లిపోతానని చెప్పాడట. చెప్పడమే కాదు బయటకు వచ్చేశాడు. బిగ్‌ బాస్‌ రూల్స్ ని బ్రేక్‌ చేస్తూ ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తాను గొప్పగా ఆడానని, తనని టార్గెట్‌ చేస్తూ వచ్చారని, అయినా పోరాడానని తెలిపారు. తనని అన్యాయంగా ఎలిమినేట్‌ చేసినట్టు పరోక్షంగా తన పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు బిగ్‌ బాస్‌ తనకు చల్తా అనే రేంజ్‌లో కామెంట్‌ చేశాడు. అదే సమయంలో రోహిత్‌ ఎలిమినేషన్‌ అన్‌ఫెయిర్‌ అంటూ పెద్ద క్యాంపెయిన్‌ నడిచింది. ఆయన అభిమానులు బిగ్‌ బాస్‌ షోపై, నాగార్జునపై ట్రోల్స్ చేశారు. ఇది నిన్న మొత్తం సోషల్‌ మీడియాని ఊపేసింది.

33
రోహిత్‌ నాయుడ బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో రోహిత్‌ని ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన రాత్రినే బయటకు వచ్చాడు. రోహిత్‌ కామనర్‌గా బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాడు. అగ్నిపరీక్షలో తానేంటో నిరూపించుకొని కంటెస్టెంట్‌గా ఎంపికయ్యాడు. హౌజ్‌లోకి వెళ్లాక తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. స్ట్రాంగ్‌ ప్లెయర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అయితే యాటిట్యూడ్‌ పరంగా, బిహేవియర్‌ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. మాటల, చేష్టల పరంగానూ విమర్శల పాలయ్యాడు. కానీ హౌజ్‌లో అందరు అతన్ని టార్గెట్‌ చేస్తున్న నేపథ్యంలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందనేది మరో వాదన. ఏదేమైనప్పటికీ బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి 8 వారాల్లో బయటకు వచ్చేశాడు రోహిత్‌. మరి ఆయన బిగ్‌ బాస్‌ షో నుంచి ఎంత పారితోషికం అందుకున్నాడనేది చూస్తే, ఆయనకు వారానికి రూ.70వేలు పారితోషికం నిర్ణయించారట. ఎనిమిది వారాలకు గానూ రూ.5.60లక్షల పారితోషికం దక్కినట్టు సమాచారం. ఇంతటి స్ట్రాంగ్‌ ప్లేయర్‌కి ఇంతటి తక్కువ పారితోషికం దక్కడం గమనార్హం. దీంతో పారితోషికంలోనూ అన్యాయమే అనే టాక్‌ వినిపిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories