రాకింగ్ రాకేష్ కి మంచి కమెడియన్ గా గుర్తింపు ఓవర్ నైట్ లో దక్కలేదు. అందరి జీవితంలో ఎదుగుదల వెనుక కష్టాలు ఉంటాయి. తాను ఈ స్థాయికి వచ్చానంటే ఎన్నో కన్నీటి బాధలు ఎదుర్కొన్నట్లు రాకింగ్ రాకేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన జీవితం, తల్లి, ప్రేయసి సుజాత గురించి అనేక విషయాలు వివరించాడు.