చీరకట్టులో ‘కేజీఎఫ్’ భామ గ్లామర్ మెరుపులు .. స్లీవ్ లెస్ అందాలతో మతి చెడగొడుతున్న శ్రీనిధి శెట్టి!

Published : Dec 25, 2022, 06:14 PM IST

తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). మరోవైపు గ్లామర్ విందుతోనూ నెట్టింట సందడి చేస్తోంది.  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  

PREV
18
చీరకట్టులో ‘కేజీఎఫ్’ భామ గ్లామర్ మెరుపులు .. స్లీవ్ లెస్ అందాలతో మతి చెడగొడుతున్న శ్రీనిధి శెట్టి!

యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కేరీర్ ప్రారంభించడానికి ముందు  మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. 
 

28

మోడలింగ్ లో మంచి ప్రతిభను కనబర్చి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో  2018లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది శ్రీనిధి శెట్టి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ KGFలో  హీరోయిన్ గా అవకాశం అందుకుంది.
 

38

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘కేజీఎఫ్’ చాఫ్టర్ 1 మరియు ఛాప్టర్ 2 ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా  విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 1.. దేశ వ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. శ్రీనిధి పెర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి.

48

తర్వాత ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ను పాన్ ఇండియన్ ఫిల్మ్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఏకంగా రూ.1800 కోట్లు కలెక్ట్  చేసి ఇండియన్ సినిమా సత్తాను చాటింది. మరోవైపు కన్నడ పరిశ్రమలో కొత్త చరిత్రను తిరగరాసింది. ఈ మూవీలో యష్ సరసన నటించిన శ్రీనిధి శెట్టికి కూడా పాన్ ఇండియన్ హీరోయిన్ గా గుర్తింపు దక్కింది. 
 

58

ఆ క్రేజ్ ను దక్కించుకునేందుకు ఇటు సోషల్ మీడియాలోనూ శ్రీనిధి రచ్చ చేస్తోంది. ఇన్నాళ్లు గ్లామర్ విందుకు కాస్తా దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కనువిందు చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తున్న ఈ ముద్దుగుమ్మ పద్ధతిగానే కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.
 

68

తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను కూడా పంచుకుంది. ఆరెంజ్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. చీరకట్టులో టాప్ గ్లామర్ షోతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. శారీ లుక్ లో యువతను ఉక్కిరిబిక్కిరింది. మరోవైపు అదిరిపోయే ఫోజులతోనూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. 

78

కన్నడ బ్యూటీ అందాలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ ను మరింతగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న శ్రీనిధి కూడా వరుస ఫొటోషూట్లతో సందడి చేస్తూనే ఉంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.  

88

తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వెంటనే తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన ‘కోబ్రా’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రానికి దాదాపు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడం గమనార్హం.

click me!

Recommended Stories