దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందిస్తున్న ఏకైక కామెడీ షో ‘జబర్దస్త్’ అనే చెప్పాలి. మరింత డోస్ పెంచుతూ వచ్చిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. రేపు రాత్రి 9 : 30 గంటలకు ప్రసారం కానున్న ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటిలాగే ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, బుల్లెట్ భాస్కర్, వర్ష, ప్రవీణ్ తమ పంచ్ లతో ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచారు.