ఒక్క ఫైట్‌ లేకుండా సినిమా చేసి బాక్సాఫీసుని షేక్‌ చేసిన బాలయ్య, ఆ మూవీ ఏంటో తెలుసా? అందరికి షాక్‌

Published : Apr 11, 2025, 08:46 PM IST

Balakrishna : బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్‌ తప్పనిసరి. ఆయన మూవీస్‌లో ఫస్టాఫ్‌లో మూడు ఫైట్లు, సెకండాఫ్‌లో మూడు ఫైట్లు ఉండాల్సిందే. కుదిరితే, చిన్నా చితకా మరో ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు కూడా కనిపిస్తాయి. బాలయ్య యాక్షన్‌ అంటే వెండితెరపై రణరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం యాక్షన్‌తోనే ఆయన సినిమాలు ఆడతాయి. దీంతో ఒక్కో సినిమాకి డోస్‌ పెంచుతూ వస్తున్నారు బాలయ్య. ఫైట్స్ లేకుండా ఆయన సినిమాలను ఊహించడం కష్టమే. 

PREV
14
ఒక్క ఫైట్‌ లేకుండా సినిమా చేసి బాక్సాఫీసుని షేక్‌ చేసిన బాలయ్య, ఆ మూవీ ఏంటో తెలుసా? అందరికి షాక్‌
balakrishna

Balakrishna : బాలకృష్ణ సినిమాల్లో మరే ఇతర హీరోల చిత్రాల్లో లేని యాక్షన్‌ ఉంటుంది. ఫైట్ సీన్లని మేకర్స్ ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తారు. ప్రత్యేకంగా కేర్‌ తీసుకుంటారు. సినిమాలో కథ ఉందా? సెంటిమెంట్‌, కామెడీ ఉందా అనేది ఎవరూ చూడరు, యాక్షన్ సీన్లు ఎలా ఉన్నాయా లేదా అనేదే చూస్తారు. అంతగా తన మార్క్ ని చూపిస్తున్నారు బాలయ్య.

దర్శకులు కూడా బాలయ్యని ఎంత వాయిలెంట్‌గా చూపించాలని ప్రత్యేకంగా ప్లాన్స్ చేస్తుంటారు. వాటి మీద నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఫైట్స్ లేకుండా బాలయ్య సినిమాలను ఊహించగలరా? కానీ ఒక మూవీ విషయంలో జరిగింది. చిన్న ఫైట్‌ లేకుండా కూడా సినిమాని తీశారు, హిట్‌ చేశారు. ఆ మూవీ బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. మరి ఆ మూవీ ఏంటనేది చూస్తే. 

24
balakrishna

బాలకృష్ణ మొదట్లో చాలా వరకు తండ్రి ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించారు. కీలక పాత్రలు చేస్తూ మెప్పించారు. వాటి చాలా వరకు పౌరాణిక చిత్రాలే  ఉంటాయి. `సాహసమే జీవితం` మూవీతో సోలో హీరోగా మారారు. కమర్షియల్‌ మూవీస్‌ బాట పట్టారు. ఒక్కో హిట్‌ అందుకుంటూ అదరగొడుతూ వచ్చారు. యాక్షన్‌ మూవీస్‌ చేస్తూ మెప్పించారు. స్టార్‌గా ఎదిగారు.

వరుస విజయాలతో దూసుకుపోయారు. అలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఫైట్స్ లేకుండా ఒక సినిమా చేశారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ సినిమానే `నారి నారి నడుమ మురారి`. ఈ మూవీని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు కోదండరామిరెడ్డి. 
 

34
nari nari naduma murari

బాలయ్య సరసన శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇద్దరు అమ్మాయిల మధ్య బాలయ్య నలిగిపోవడమే ఈ మూవీ కాన్సెప్ట్. మంచి కుటుంబా కథా చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. ఇందులో ఒక్క ఫైట్‌ కూడా లేదు. 1990 ఏప్రిల్‌ 25న ఈ మూవీ విడుదలైంది. అప్పట్లో ఊహించని విధంగా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఈ సక్సెస్‌ చిత్ర బృందానికే షాకిచ్చింది. వాళ్లు కూడా ఇది ఆడుతుందా అనే డౌట్‌ వ్యక్తం చేశారట. కానీ థియేటర్లకి జనం క్యూ కడుతున్న తీరు ని చూసి ఆశ్చర్యపోయారట. సమ్మర్‌లో మంచి ఎండల్లో వచ్చి కూడా ఈ మూవీ అంతటి విజయాన్ని సాధించడం విశేషం. అయితే ఇది బాలయ్యకి 50వ మూవీ కావడం మరో విశేషం. 
 

44
akhanda

ఇక చివరగా ఈ సంక్రాంతికి `డాకు మహారాజ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో వచ్చిన `అఖండ 2`కిది సీక్వెల్‌. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుందట. 

read  more: ఒక్క మాటతో జయలలిత ప్రభుత్వాన్ని కూల్చేసిన రజనీకాంత్‌.. తలైవీతో సూపర్‌ స్టార్‌ గొడవ ఏంటో తెలుసా?

also read: అక్కినేని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రి.. ఆ సాకుతో మహానటికి బిగ్‌ హ్యాండ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories