'రాబిన్ హుడ్' రిజల్ట్‌ చూసి, భయపడే టీమ్ ఇలాంటి పోస్ట్?

Published : Mar 31, 2025, 12:06 PM IST

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన 'రాబిన్ హుడ్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో చిత్ర బృందం కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేయకుండా వెనకడుగు వేసింది. రెండో రోజు కంటే మూడో రోజు ఫుట్ ఫాల్స్ పెరిగాయని మాత్రమే తెలిపింది.

PREV
13
 'రాబిన్ హుడ్' రిజల్ట్‌ చూసి, భయపడే టీమ్ ఇలాంటి పోస్ట్?
Robinhood Fails to Impress Disaster Confirmed? in telugu


నితిన్ హీరోగా 'భీష్మ' వంటి సక్సెస్ ఫుల్  సినిమా తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల తీసిన సినిమా 'రాబిన్ హుడ్'. థియేటర్లలోకి రావడానికి ముందు విపరీతంగా ప్రమోషన్స్  చేశారు.

హీరో నితిన్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేరకు కష్టపడ్డాడు. అయితే ఫలితం లేదు. మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు సోసోగా వచ్చాయి. ఈ నేపధ్యంలో కలెక్షన్స్ కూడా పూర్తి డ్రాప్ ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ పోస్టర్స్ వేయటానికి టీమ్ వెనకడుగు వేసింది.

23
Robinhood Fails to Impress Disaster Confirmed? in telugu


తాజాగా ఈ చిత్రం కు సంభందించిన ఓ ఇంట్రస్టింగ్  పోస్ట్ ని టీమ్ షేర్ చేసింది. అందులో ఈ చిత్రం కలెక్షన్ల సంఖ్యను చెప్పలేదు కానీ డే 2 కంటే డే 3కి టాక్ బాగా పెరిగిందని, ఫూట్ ఫాల్స్ పెరిగాయని చెప్పింది.  

అయితే  రెండో రోజు ఎన్ని కోట్లు కలెక్షన్స్ వచ్చాయి? మూడో రోజు ఎన్ని కోట్లు వచ్చాయి? అన్నది మాత్రం మైత్రి చెప్పలేక సైలెంట్ అయ్యిపోయింది.  ఈ సినిమాకు కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తే విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుందని ఇలా  మైత్రి ఫిక్స్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. 
 

33
Robinhood Fails to Impress Disaster Confirmed? in telugu


 'రాబిన్ హుడ్' చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 70 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమా తీసింది. అయితే ఏడు కోట్ల రూపాయల వసూళ్లు కూడా మొదటి రోజు రాలేదు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫ్లాప్ తర్వాత నితిన్ శ్రీ లీల జంట మరో ఫ్లాప్ తమ ఖాతాలో వేసుకున్నట్లు తేలింది.  ఈ సినిమాను దాదాపు 40 కోట్ల రూపాయలకు అమ్మారు. థియేటర్స్ నుంచి అందులో సగం రెవెన్యూ (షేర్) వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories