నా కొడుకుని బలిపశువును చేయద్దు: వివాదంపై పృథ్వీరాజ్‌ తల్లి

మోహన్‌లాల్‌ నటించిన ‘ఎల్‌2 : ఎంపురాన్‌’ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడిని అన్యాయంగా నిందిస్తున్నారని, తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Mohanlal Empuraan row Prithiviraj Sukumaran  mother Mallika speaks out  in telugu jsp
Mohanlal Empuraan row Prithiviraj Sukumaran mother Mallika speaks out in telugu


మోహన్‌లాల్‌ (Mohanlal) నటించిన ‘ఎల్‌2 : ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాను ఇప్పటికే చిత్ర దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో మాట్లాడానని నిర్మాత గోకులం గోపాలన్‌ తెలిపారు.

వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని చెప్పానన్నారు.ఇదే సమయంలో ‘ఎల్‌2:ఎంపురాన్‌’ వివాదంపై దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తల్లి స్పందించారు. తన కుమారుడిని మాత్రమే నిందిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. ఆవేదన వ్యక్తంచేస్తూ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. దీనిపై మొదట స్పందించకూడదనుకున్నప్పటికీ తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో పోస్ట్‌ పెడుతున్నట్లు తెలిపారు.

Mohanlal Empuraan row Prithiviraj Sukumaran  mother Mallika speaks out  in telugu jsp
Mohanlal Empuraan row Prithiviraj Sukumaran mother Mallika speaks out in telugu


‘‘ఎల్‌2:ఎంపురాన్‌’ (L2 Empuraan) తెర వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను అన్యాయంగా నిందిస్తున్నారు. తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాటిని చూసి ఓ తల్లిగా ఆవేదన చెందుతున్నా. మోహన్‌లాల్‌, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు.

మోహన్‌లాల్‌ నాకు ఎన్నో రోజులుగా తెలుసు. నా తమ్ముడితో సమానం. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో ప్రశంసించాడు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతడు ఎవరినీ మోసం చేయలేదు. ఎప్పటికీ చేయడు’’.


Mohanlal Empuraan row Prithiviraj Sukumaran mother Mallika speaks out in telugu


‘‘ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే వాటిలో ఇందులోభాగమైన అందరికీ బాధ్యత ఉంటుంది. వారంతా స్క్రిప్ట్‌ చదివారు. చిత్రీకరణ సమయంలో అందరూ ఉన్నారు. అందరి ఆమోదంతోనే చిత్రం తెరకెక్కింది. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారు. అవసరమైతే డైలాగుల్లో మార్పులు చేసేవారు.

కానీ, సినిమా విడుదలయ్యాక పృథ్వీరాజ్‌ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు?. మోహన్‌లాల్‌కు (Mohanlal) తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆయన కూడా సినిమాను చూశారు. నా కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదు.. అలా ఎప్పటికీ చేయడు’’ అని మల్లిక తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సినిమా షూటింగ్‌ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపారు.

Mohanlal Empuraan row Prithiviraj Sukumaran mother Mallika speaks out in telugu


ఇంతకీ వివాదం ఏమిటంటే:

2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుపడుతున్నారు.

ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సీన్స్‌ ఉన్నాయని అంటున్నారు. పృథ్వీరాజ్‌ దర్శకత్వాన్ని విమర్శిస్తూ నెట్టింట వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
 

Mohanlal Empuraan row Prithiviraj Sukumaran mother Mallika speaks out in telugu


పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘ఎల్‌2:ఎంపురాన్‌’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

అయితే కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో చిత్రబృందం వాటిలో మార్పులు చేసింది. సినిమాలో మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Latest Videos

vuukle one pixel image
click me!