క్రిస్టఫర్ నోలెన్ పేరు చెప్పగానే ఇంటర్ స్టెల్లార్ లాంటి నభూతో నభవిష్యతి అనిపించే చిత్రాలు గుర్తుకు వస్తాయి. నోలెన్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు.