నేచురల్ స్టార్ నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ.. అప్పటి నుంచి డీసెంట్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. చివరిగా ‘వరుడు కావాలెనులో’ మెరిసింది. ప్రస్తుతం ఆమె చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆకాశం’, ‘ధ్రువ నక్షతం’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.