మహేష్ బాబుకి సమానమైన హీరో ఎవరు ? ఆ రెండు విషయాల్లో సూపర్ స్టార్ కి పోటీ లేదా..

Published : Feb 24, 2025, 07:04 AM IST

మహేష్ బాబు సౌత్ లో టాప్ స్టార్స్ లో ఒకరు. ఆ విషయంలో తిరుగులేదు. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

PREV
15
మహేష్ బాబుకి సమానమైన హీరో ఎవరు ? ఆ రెండు విషయాల్లో సూపర్ స్టార్ కి పోటీ లేదా..
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. రాజమోళి ఈ చిత్రంలో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేశారు. 

 

 

25

మహేష్ బాబు సౌత్ లో టాప్ స్టార్స్ లో ఒకరు. ఆ విషయంలో తిరుగులేదు. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మహేష్ బాబు సూపర్ క్రేజ్ ఉన్న హీరో. మహేష్ కి సమానమైన క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని నాగబాబు అన్నారు. 

 

35

కానీ మహేష్ కి మహిళల్లో ఉన్నంత ఆదరణ ఇంకెవరికీ లేదు. హ్యాండ్సమ్ విషయంలో మహేష్ కి తిరుగులేదు. క్రేజ్ విషయంలో మాత్రం పవన్, మహేష్ సమానం అని నాగబాబు తెలిపారు. మహేష్ ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. నా భార్య అయితే మహేష్ ని ఒక తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది. అమ్మాయిలకి మాత్రం మహేష్ రొమాంటిక్ హీరో. 

45

మహేష్ బాబుకి నటుడిగా 100 అడ్వాంటేజ్ లు ఉన్నాయి. బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు అని నాగబాబు ప్రశంసించారు. చిన్నప్పుడు మహేష్ బాబు కాస్త చబ్బీగా ఉండేవాడు. తన లుక్స్ మార్చుకోవాలని ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. కేబీఆర్ పార్క్ లో విపరీతంగా రన్నింగ్ చేసేవాడు. 

55

చూస్తుండగానే సన్నగా హ్యాండ్సమ్ గా మారిపోయాడు అని నాగబాబు ప్రశంసించారు. ఇక రాజమౌళి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు ఈ చిత్రంలో అటవీ నేపథ్యంలో వీరుడిగా నటిస్తున్నారు. ప్రపంచం నివ్వెరపోయేలా ఈ చిత్రంలో యాక్షన్, విజువల్స్ ఉంటాయని తెలుస్తోంది. 

 

 

Read more Photos on
click me!

Recommended Stories