Bigg Boss Telugu 9: ఇతర ఆడోళ్ల భర్తలపైనే రీతూ చౌదరీ ఫోకస్‌.. బండారం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్‌

Published : Sep 11, 2025, 05:20 PM IST

గ్లామర్‌ బ్యూటీ రీతూ చౌదరీ బిగ్‌ బాస్‌లోకి వెళ్లి తనదైన స్టయిల్‌లో పులిహోర కలుపుతుంది. అయితే ఆమె అసలు స్వరూపం బయటపెట్టాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌.   

PREV
15
రీతూ చౌదరీ బండారం బట్టబయలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ప్రారంభమై నాలుగు రోజులకు చేరుకుంది. ప్రారంభం రోజు కాస్త డల్‌గానే అనిపించినా ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంటోంది. కంటెంట్‌ ఇచ్చేందుకు కంటెస్టెంట్లు చాలా ప్రయత్నిస్తున్నారు. కొంత వరకు ఫోకస్‌ కోసం కావాలని డ్రామాలు ఆడుతున్నా, మరికొంత సీరియస్‌గానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా రీతూ చౌదరీ బండారం బయటపెట్టారు జబర్దస్త్ కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌. ఎప్పుడూ ఇతర ఆడవాళ్ల భర్తలపైనే రీతూ చౌదరీ ఫోకస్‌ ఉంటుంది కామెంట్‌ చేశారు.

25
డీమాన్‌ పవన్‌తో రీతూ పులిహోర వేషాలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 లేటెస్ట్ ప్రోమోల్లో రీతూ చౌదరీ డీమాన్‌ పవన్‌తో పులిహోర కలుపుతూనే ఉంది. ఫస్ట్ రోజు నుంచే ఆమె ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ పవన్‌ స్కిప్‌ చేస్తున్నాడు. అయినా వదలడం లేదు. తాజాగా ఓ బౌల్‌ని క్లీన్‌ చేస్తూ అతన్నే చూస్తుంది. ఆ తర్వాత చూడు నీ మొహం కనిపిస్తుంది అద్దంలో అని ఆ పాత్రని చూపించింది. దానికి పవన్‌ ముసిముసి నవ్వులు చిందించాడు. 

35
మనసులను దోచుకుంటూ వస్తువులను కాదు

ఆ తర్వాత కిచెన్‌లో రీతూ వంట చేస్తుండగా, మాస్క్ మ్యాన్ హరీష్‌ వచ్చి తన పెన్సిల్‌ పోయిందని, ఫ్లోరా తనకు ఇచ్చిందని చెబుతాడు. దీనికి నేను చూడలేదని చెబుతుంది. చూడటం కాదు దొంగతనం చేశారా? అని అడగ్గా ఇంటా వంటా లేదని చెబుతుంది రీతూ. అంతేకాదు తనకు మనసులను దోచుకోవడం తప్ప, మనుషుల వస్తువులను దోచుకోవడం తెలియదని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీనికి హరీష్‌ కౌంటర్‌ ఇస్తూ 15ఏళ్లప్పుడే ఇవన్నీ చూశామని చెప్పడం అదిరిపోయింది.

45
అమ్మాయిలా మారిపోయి రీతూ బండారం బట్టబయలు

అనంతరం జబర్దస్త్ కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌ లేడీ గెటప్‌ వేశారు. హౌజ్‌మేట్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. లేడీ గెటప్‌లో హౌజ్‌లోకి వస్తూ, హాయ్‌ గాయ్స్ అంటూ అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. తాను జుట్టుకోసం ఎర్లీ మార్నింగ్‌ లెమన్‌ వాటర్‌ తీసుకుంటానని చెబుతాడు. పక్కనే ఉన్న సంజనా మేకప్‌ అద్దుతుంటుంది. దీంతో హే ఆగు ఇచ్చే పేమెంట్‌ కంటే ఎక్కువ చేస్తున్నావని కామెంట్‌ చేయడం నవ్వులు పూయించింది. పక్కనే ఉన్న శ్రీజ `మీ ఆయన ఏదో మాట్లాడతాడంటా` అని అనగా, `మా ఆయన పెళ్లి రోజు కూడా నచ్చాడా` అని అడిగితే ఊ అన్నాడని చెప్పడం నవ్వులు పూయించాడు. ఇంతలో మరో పక్కన ఉన్న రీతూని చిరాకు తెప్పించగా, హే అటెళ్లు అంటాడు. అంతటితో ఆగలేదు. నీకన్నీ మా కాఫీనే కావాలి, మా మొగుడే కావాలి అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీనికి రీతూ కూడా నవ్వులు చిందించింది. గురువారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ ప్రోమో అదిరిపోయింది. ఆద్యంతం ఎంటర్‌ టైనింగ్‌గా ఉంది.

55
ప్రియా, శ్రీజలకు ఝలక్ ఇచ్చిన మనీష్‌

దీంతోపాటు మరోప్రోమోని విడుదల చేశారు. ఇందులో `ఆ అమ్మాయి ఒక్కరి వల్ల మా టీమ్‌లో అందరం డిస్టర్బ్ అయిపోయామ`ని చెప్పింది శ్రష్టి వర్మ. దీనికి సంజనాని చూపించారు. ఆ తర్వాత సంజనాని తమ హౌజ్‌లోకి రెండు రోజులు ఎంట్రీ లేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. దానికి అందరు ఓకే చెప్పారు. అనంతరం హోనర్స్ హౌజ్‌లో ప్రియా, శ్రీజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారని మనీష్‌ కామెంట్‌ చేశారు. దీన్ని ప్రియా, శ్రీజ వ్యతిరేకించారు. వాదించారు. నిన్నటి నుంచి నోటీస్‌ చేస్తున్నా ఏదేదోమాట్లాడుతున్నారని వెల్లడించారు మనీష్‌. దీంతో హౌజ్‌ మొత్తం హీటెక్కిపోయింది. మొత్తంగా గురువారం ఎపిసోడ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుందని తెలుస్తోంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories