ఇప్పటికే ఈ షోకి పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు.అందరిలాగే చిలిపి ప్రశ్నలు అడుగుతూ శ్రీసింహాకి రీతూ చౌదరి చుక్కలు చూపించింది. పచ్చిగా డబుల్ మీనింగ్ ప్రశ్నలు కూడా అడిగింది. మీ ఇంట్లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరూ ఉన్నారు ఎలా సాధ్యం అని రీతూ ప్రశ్నించింది. మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు అంటూ శ్రీసింహా ఫన్నీగా సమాధానం ఇచ్చారు.