ఇక పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ సోమవారం జరిగింది. కంటెస్టెంట్లు నామినేషన్ చేసిన దాని ప్రకారం భరణి, దివ్య, రీతూ, నిఖిల్, రీతూ, గౌరవ్ నామినేట్ అయ్యారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ సారి అందరు నామినేషన్‌లో ఉంటారని తెలిపారు. కంటెస్టెంట్ల సపోర్ట్ తో కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయెల్ ఈ నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉంటారు. అయితే వీరు నామినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అందుకోసం బిగ్ బాస్ హౌజ్‌ని ఒక రాజ్యంగా మార్చేశారు. ఇందులో కళ్యాణ్, రీతూ, దివ్య రాజు రాణులుగా వ్యవహరిస్తారు. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, భరణి, గౌరవ్‌లు ప్రజలుగా, తనూజ, నిఖిల్, సంజనా, డీమాన్ పవన్ కమాండర్లుగా పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాజు, రాణులను ఇమ్మాన్యుయెల్ ఆటపట్టించిన తీరునవ్వులు పూయించింది. ఆ తర్వాత సుమన్ శెట్టిని కమాండర్స్ ట్రీట్‌మెంట్ కామెడీని పంచింది.