శివ సీక్వెల్ లో హీరో ఎవరు? నాగచైతన్య, అఖిల్ కి ఆర్జీవీ అవకాశం ఇస్తాడా ? తేల్చేసిన నాగార్జున

Published : Nov 11, 2025, 04:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన శివ సినిమా.. రీసెంట్ గా రీరిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది. అయితే శివ సినిమాకు సీక్వెల్ తీస్తే హీరో ఎవరు..? నాగచైన్య, అఖిల్ ఈ ఇద్దరిలో ఆర్జీవి ఎవరిని తీసుకుంటాడు? ఈ విషయంలో నాగార్జున అభిప్రాయం ఏంటి?

PREV
15
ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ

తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా శివ. 1989లో విడుదలైన ‘శివ’ తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసింది. కింగ్ నాగార్జున కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై 36 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ క్లాసిక్ హిట్ మూవీ నవంబర్ 14న మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ శివ సినిమా సీక్వెల్ కు సబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు.

25
శివ సినిమా సీక్వెల్ లో హీరో ఎవరు?

ఈసందర్భంగా విలేకరులు శివ సీక్వెల్ చేస్తే నాగ చైతన్య లేదా అఖిల్‌లలో ఎవరితో చేస్తారు? అని ప్రశ్నించగా వర్మ స్పష్టంగా సమాధానం ఇచ్చారు. “శివ సినిమా నాగార్జున కోసం మాత్రమే చేయబడింది. ఆయన తప్ప ఇంకెవ్వరినీ ఆ పాత్రలో ఊహించుకోలేను. ఆ సినిమాకు నాగార్జుననే ఆత్మ. ఇంకో 36 ఏళ్లు గడిచినా, నేను కాక మరెవరైనా తీసినా కూడా ‘శివ’ను ఆయన తప్ప మరెవ్వరూ మళ్లీ చేయలేరు. సీక్వెల్ చేయాల్సి వస్తే అది నాగార్జునతోనే ఉంటుంది,” అని వర్మ తెలిపారు.

35
రామ్ గోపాల్ వర్మ కీలక కామెంట్స్

అంతే కాదు శివ సినిమా సీక్వెల్‌పై మరో కీలక కామెంట్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. శివ సీక్వెల్ కోసం నాగార్జున వారసులుగా.. నాగ చైతన్య లేదా అఖిల్‌ ను తీసుకోవాలనే ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై కింగ్ నాగార్జున కూడా స్పందించారు. సరదాగా స్పందిస్తూ, ''వాళ్లెందుకు నేను ఉన్నాను కదా..? నేనే శివ సీక్వెల్‌ చేస్తా,” అంటూ ప్రెస్ మీట్ లో నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

45
నాగార్జున జీవితాన్నిమార్చేసిన సినిమా

1989 అక్టోబర్ 5న విడుదలైన ‘శివ’ సినిమా .. అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు పరిశ్రమకు కొత్త రూట్ ను చూపించింది. మొదటి సినిమా అయినా.. రామ్ గోపాల్ వర్మను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది మూవీ. అంతే కాదు కింగ్ నాగార్జున కెరీర్ కు కు శివ సినిమా లాండ్ మార్క్ గా నిలిచింది. ఆయన మూవీ లైఫ్ కు కంప్లీట్ గా టర్న్ చేసింది సినిమా.

55
తమిళంలో కూడా శివ ప్రభావం..

‘శివ’లోని యాక్షన్, రియలిజం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా ప్రభావం తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా కనిపించింది. అప్పట్లో తమిళంలో కూడా యూత్ చైన్ లాగడం ఫ్యాషన్ అయిపోయింది. నాగార్జునకు తమిళ్ లో కూడా ఫ్యాన్స్ పెరిగారు. కానీ ఎందుకో నాగ్ టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేశారు. తమిళ్ వైపు చూడలేదు.

Read more Photos on
click me!

Recommended Stories