Guppedantha Manasu: వసుధారకు చీర గిఫ్ట్ ఇచ్చిన రిషీ.. జగతితో ప్రేమగా మాట్లాడిన ఇగో మాస్టర్!

First Published Oct 14, 2022, 11:31 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి కొన్ని చీరలు ఎంచి మంచం మీద పెడతాడు. ఇందులో ఏదో ఒక చీరలు ఎంచు వసుధార అంటాడు.అదే సమయంలో నేను ఇప్పుడే వస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మాత్రం అడగొద్దు ఇక్కడే వెయిట్ చెయ్యి అని రిషి అంటాడు. కింద దేవయాని వాళ్ళు, రిషి వాసుధారలు ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో గౌతం, నేను వెళ్లి వాళ్ళని పిలుస్తాను అని అనగా జగతి గౌతమ్ ని ఆపి, గౌతమ్ నీ వెళ్ళవద్దు అని సైగలు చేస్తుంది. మరోవైపు వసుధార, రిషి కోసం ఎదురు చూస్తూ ఉండగా రిషి అక్కడికి వచ్చి వసుధార తనకోసం తెచ్చిన బొమ్మలను అక్కడ పెడతాడు. అప్పుడు వసు,సార్ ఇది చాలా బాగుంది కదా దీంతో మనం ఒక ఫోటో తీసుకుందాము అని అనగా రిషి సెల్ఫీ తీస్తాడు. మరోవైపు కింద రిషిదారులు ఒక గదిలోనే ఇప్పటికి వచ్చి రాలేదు అని దేవయాని కంగారుపడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర, వీరు ఇంకా రాలేదేంటి అని అంటాడు. 

దానికి జగతి, పోనీలే మహేంద్ర అని అనగా దేవయాని, కింద కంగారు పడితే కుదరదు పైకెళ్ళి పిలిస్తే కుదురుతుంది అని అనగా అదే సమయంలో రిషి, వసుదారలు కిందకి వస్తారు.చేతులో బొమ్మ ఏంటి అని దేవయాని అడగగా, నేనే చేశాను మేడం అని వసుధార అంటుంది.అప్పుడు గౌతమ్,ఈ  బొమ్మలు చాలా బాగున్నాయి మీకు ఫోటో తీస్తాను అని అంటాడు. దానికి వసుధార, మేము ముందే తీసుకుందాము అని మాట పూర్తిగా కాకముందే రిషి వసుని ఆపుతాడు. ఏదో అంటున్నావు అని గౌతమ్ అనగా, ఏమీ లేదు అని వసు చెప్పగా గౌతం వాళ్లకి ఫోటో తీస్తాడు.తర్వాత ఆ బొమ్మ ను బొమ్మల కొలువు దగ్గర పెట్టి అందరూ బొమ్మలు కొలువు చేస్తారు. అప్పుడు అందరూ మనసులో కోరికలు కోరుకుంటూ, రిషి,వసుదారలు ఎప్పుడూ కలిసే ఉండాలి అని జగతి మహీంద్రాలు కోరుకుంటారు. దేవయాని, నా పెద్దరికం ఎప్పటికీ పోకూడదు రిషికి నామీద ఎప్పుడు ప్రేమ గౌరవం ఉండాలి అని కోరుకుంటుంది.
 

ధరణి, అత్తయ్య గారు ఏం కోరుకున్నారో అది జరగకూడదని కోరుకుంటుంది. గౌతం మాత్రం బయటికి, ఈ రిషి గాడు కోపం తగ్గితే చాలు దేవుడా నాకేం పెద్ద కోరికలు లేవు అని అంటాడు. దానికి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు రిషి మనసులో, వసుధార నాకు పూర్తిగా కావాలి ఏ ఒప్పందాలు లేకుండా అలాగే వసుధార జీవితంలోపైకి ఎదగాలి అని కోరుకుంటాడు. వసు మనసులో రిషి సార్ ఎప్పుడు ప్రిన్స్ లాగే ఉండాలి సార్ జీవితంలో ఏం మాచ్చ లేని చంద్రుడిలా ఉండాలి అని కోరుకుంటుంది. అదే సమయంలో గౌతమ్ అందరికీ ఫోటోలు తీస్తూ ఉండుగా మీకు తీస్తాను పెద్దమ్మ రండి అని  అంటాడు.నాకెందుకులే అని దేవయాని అనగా తీసుకోండి వదిన గారు అని మహేంద్ర అంటాడు. అప్పుడు దేవయాని వేర్వేరు ఫోజులిస్తూ అందరితో ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ దేవయానితో, అసలు బొమ్మలు కొలువు ఎందుకు పెడతారు అని అడుగుతాడు. దేవయాని కి జవాబు తెలియక నోసుక్కుంటూ ఉంటుంది.

అప్పుడు వసుధార మధ్యలో మాట్లాడుతూ, బొమ్మలకొల్లు అనేది పూర్వకాలపు వస్తువులను,మన ప్రాచీన సంప్రదాయక వస్తువులను తర్వాత తరాలకి చూపించాలి అని పెడతారు అని అనగా ఈ జనరేషన్ వాళ్ళకి ఏవి తెలియదు కదా వసుధార నీకు మాత్రం ఎలా తెలుస్తున్నాయి అని గౌతమ్ అడుగుతాడు. తెలుసుకోవాలని ఆలోచన ఉంటే ఏమైనా చేయొచ్చు సార్ అని ఈ వసు అంటుంది. అదే సమయంలో రిషి పైకెళ్ళి ఒక చీరను తీసుకొని వస్తాడు. జగతి దగ్గరికి వెళ్లి మేడం ఈ చీర మా నానమ్మది. కనుక ఈ సందర్భం రోజు ఈ చీరని మీ చేతులతో వసుధారకి ఇవ్వాలని కోరుకుంటున్నాను వసుధార ఈ చీర కట్టుకుని వస్తే నాకు చాలా ఇష్టం అని అంటాడు. దానికి దేవయాని ఒకేసారి ఉరుకు పడుతుంది అప్పుడు దేవయాని మధ్యలో అడ్డుకుంటూ ఉండగా, పెద్దమ్మ ఇవ్వనివ్వండి అని రిషి అంటాడు.దానికి జగతి చాలా ఆనందపడి వసుధార కి ఇస్తూ ఉండగా దేవయాని ఆపి, మా అత్తయ్య గారి చీర పసుపు పెట్టి ఇవ్వు అని అంటుంది.

అప్పుడు రిషి, అవును జగతి మా అమ్మ పేరు వింటేనే నాకు చాలా ఆనందంగా ఉన్నది నీటిగా పసుపు, కుంకాలూ అన్ని రది ఇవ్వు అనగా రిషి,ఇంకేదో పద్ధతులు ఉంటాయి కదా అవి కూడా చేసి ఇవ్వండి నాకు ఇది ఒకటే తెలుసు అని అంటాడు. దానికి అందరూ సంతోషపడుతూ ఉండగా,వసు మనసులో దిగులు గా ఉంటుంది.అప్పుడు జగతి వెళ్లి చీర కట్టుకొని రా వసుధారా అని వసుదారకి చీర ఇస్తుంది.వసుధార మాత్రం సంకోచిస్తూ చీరని తీసుకొని పైకి వెళ్తుంది. పైన తన గదిలో ఆలోచనలో పడిన వసు దగ్గరికి జగతి వస్తుంది.
 

ఏమైంది వసు అని అనగా, మేడం నేను ఈ చీర కట్టుకుంటే ఇంటికి సగం కోడల్ని అయిపోయినట్టే అని అనగా, అందులో తప్పేమున్నది వసు అని జగతి అంటుంది. తప్పు కాదు మేడం నేను రిషి సార్ ని మచ్చలేని చంద్రుడిలా చూడాలనుకుంటున్నాను. నేను పూర్తిగా ఇంటికి కోడల్ని అవ్వకముందే నేను తీర్చాల్సిన కర్తవ్యం ఉన్నది. నాకు రిషి సార్ అంటే ఇష్టమే కానీ ఈ సమయంలో నేను ఇలా చేయలేను కదా అని అనగా, ప్రతి దానికి సమయం సందర్భం ఉంటుంది వసు. ఇప్పుడు నువ్వు దీన్ని అడిగి గొడవ పెద్దది చేయొద్దు అని అనగా, కాదు మేడం కొన్ని వాటికి మాత్రమే సమయం సందర్భం ఉంటుంది అన్ని వాటికి కాదు.
 

 ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోతూ పోతే అది జీవితం కాదు. రిషి సార్ ని ఎవరూ వేలెత్తి చూపించుకోకుండా నేను చేయాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు ఇది నేను చేయలేను అని అనగా మహేంద్ర అదే సమయంలో అక్కడికి వచ్చి, అనవసరంగా గురుదక్షిణ ఒప్పందం చేసి గొడవని పెద్దది చేసినట్టున్నాను అని అనుకుంటాడు. మహేంద్ర ని చూసిన జగతి, నేను తర్వాత వస్తాను మహేంద్ర నువ్వు కిందకి వెళ్ళు అని అంటుంది. అప్పుడు జగతి వసుదారతో, మహేంద్ర కూడా ఇంత జరుగుతాదని ఊహించకుండా గురుదక్షిణ అడిగాడు. ఇప్పుడు దానికి బాధపడుతున్నాడు.
 

 కావాలంటే ఇప్పుడు నేను మహేంద్ర చేతే గురుదక్షిణ వద్దు అని చెప్పించమంటావా అని వసుతో అడగగా వద్దు మేడం, సార్ చెప్పారు అని కాదు నిజంగానే రిషి సార్ కి ఏ మచ్చ వుండకూడదు ఇదే నా నిర్ణయం అని అంటుంది.నువ్వు ఇంత మొండి దానివి ఎందుకు అవుతున్నావ్ అని వసు తో అంటుంది జగతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!