Janaki Kalaganaledu: జానకి చదువు కోసం రామా సహాయం.. తులసి కోటను పగలగొట్టి జానకి మీద తోసిన మల్లిక!

First Published Oct 14, 2022, 10:38 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రామ,జానకిలు జ్ఞానాంబతో, మీరు అఖిల్ ని చాలా ప్రేమగా పెంచారు అఖిల్ కూడా మిమ్మల్ని చాలా ప్రేమతో చూసుకుంటాడు. కానీ అఖిల్ తప్పు చేశాడని మీరు తనతో మాట్లాడడం మానేస్తే తను ఆ బాధ తట్టుకోలేక ఇలాంటి పనులను చేస్తున్నాడు. ఒకవేళ మీరు ఇప్పుడు అఖిల్ ని క్షమించకపోతే తను ఇంకా ఎన్ని పనులు చేస్తాడో అని నాకు భయమేస్తుంది అని అనగా జ్ఞానాంబ,నేను అఖిల్ ని క్షమించడానికి సమయం పడుతుంది కానీ మీరు ఇన్ని సార్లు చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను అని అంటుంది.
 

 ఆ తర్వాత సీన్లో రాత్రి రామ పడుకున్నప్పుడు జానకి చదువుకుంటూ ఉంటుంది. జానకిని చూసి రామా పడుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం రామ లెగిసి చూసేసరికి జానకి పుస్తకాలు విప్పి పడుకొని ఉంటుంది. అప్పుడు రామా లేచి,జానకి గారు చాలా కష్టపడుతున్నారు ఈ సమయంలో జానకి గారిని ఇంటి పనులు చేయకుండా నేనే పనులన్నీ చేయాలి అనుకుని ఉదయాన్నే లేచి వంట గదిలోకి వెళ్తాడు. రామా వంట గదిలోకి  వెళ్లడం చూసిన మల్లికా ఏం చేస్తున్నారు బావగారు అని అనుకుంటుంది. అప్పుడు రామా జానకి కోసం టీ పెట్టి జానకి దగ్గరకి వెళ్లి ఇస్తాడు.
 

 లేగండి జానకి గారు చదువుకోండి అని అనగా మీరు టీ పెట్టడం ఎందుకు రామ గారు అని జానకి అంటుంది. టీ ఏ కాదు ఇంట్లో పనులన్నీ నేను చేసేసాను మీరు ఇంక శ్రద్ధగా చదువుకోవచ్చు అని అనగా, మీరు ఎందుకు ఈ పనులు చేశారు రామ గారు అని జానకి అంటుంది. మీరేమీ భయపడదు జానకి గారు అమ్మ ఏమి అనుకోదు. మీకున్న లక్ష్యం కోసం ఇది ఒక ఎలుక సాయం అనుకోండి అని అనగా, ఎవరో ఏదో అనుకుంటారని కాదు రామ గారు నా పనులన్నీ నేను చేసుకున్న తర్వాత చదువుకుంటాను అని అంటుంది జానకి .అప్పుడు రామా జానకిని ఆపి, ముందు మీరు చదువుకోండి పరీక్షలు అయిన తర్వాత అన్ని పనులు మీరే చేస్కోండి అని అంటాడు.
 

 ఇదంతా చూస్తున్న మల్లిక, బావ గారు జానకికి ఎంత సహాయం చేస్తున్నారు నేను ఎలాగైనా జానకి చదువు చెడగొట్టాలి లేకపోతే నాకు కోపం మండిపోతుంది అని అనుకోని, ఏదైనా ఆలోచించాలి మంచి ప్లాన్ వేయాలి అని అనుకుంటుంది. అదే సమయంలో తులసి కోటను చూసిన మల్లిక వెంటనే అక్కడికి వెళ్లి, తులసమ్మ నన్నేం తిట్టుకోవద్దు క్షమించు అని చెప్పి తులసి మొక్కను పీకి కింద పారేస్తుంది .దీన్ని ఒక కిటికీలోనుంచి రామా జానకి లు జాగింగ్ కి వెళదామని బయలుదేరినప్పుడు చూస్తారు. దాన్ని చూసి మల్లిక ఏం చేస్తుంది అనుకుని మల్లిక దగ్గరికి వెళ్దాం అనుకునే సమయానికి జ్ఞనాంబ అక్కడికి వస్తుంది.
 

మల్లిక అక్కడి నుంచి పారిపోతుంది.అప్పుడు జ్ఞానాంబ కూలిపోయిన తులసి కోట ని చూసి చికితని పిలుస్తుంది. ఇది ఎవరో కావాలని చేసినట్టున్నారు చికిత ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది అని అనగా,ఇందాక నేను వచ్చినప్పుడు బానే ఉన్నది అమ్మగారు ఇప్పటికిప్పుడే ఏమైందో తెలియడం లేదు అని అంటుంది. అప్పుడు అక్కడికి అందరూ వస్తారు. అక్కడే ఉన్న మల్లిక, అయ్యో అత్తయ్య గారు ఇంత పని జరుగుతుంది నేను అనుకోలేదు ఎవరో కావాలని చేసినట్టున్నారు ఇంక ఎవరు చేస్తారు జానకి చేసి ఉంటుంది అని అంటుంది. అప్పుడు రామా నిజం చెప్పబోతూ ఉండగా జానకి,రామని ఆపుతుంది.
 

అప్పుడు జ్ఞానాంబ, జానకి మనస్తత్వం నాకు తెలుసు తను అలాంటిది కాదు ఒకవేళ తెలియకుండా ఏ తప్పు చేసినా నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతుంది అని అనగా, ఎంత చేసినా సరే జానకి మీద దీనికి నమ్మకం పోవట్లేదు ఏంటి అని అనుకొని జెస్సి మీద తోసేద్దాము అని , మరీ తులసి కోట విలువ తెలియలేని జెస్సీ ఏ ఇలా చేసి ఉంటుంది అని అనగా జెస్సి, నేను చేయలేదు అత్తయ్య గారు నేను ఇటువైపు రానేలేదు అని అంటుంది. అప్పుడు చికిత నెమ్మదిగా మల్లిక దగ్గరికి వెళ్లి,మీరేంటండి భుజాలు పండుకుంటున్నారు కొంపతీసిందులో మీ హస్తం ఏమైనా ఉన్నదా అని అడుగుతుంది.
 

దానికి మల్లిక, ఏదైనా దొంగతనం జరిగితే పాత నేరస్తుల్ని అడిగినట్టు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు చికిత అని అంటుంది.అప్పుడు జానకి,నేనే చేసిన అత్తయ్య గారు అనగా మల్లికా ఆశ్చర్యపోయి, ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకుంటుంది. అప్పుడు జానకి,నేనే చేశాను అత్తగారు మీకు వచ్చి క్షమాపణ అడుగుదాం అనుకునే సమయానికి మీరు చూసేసారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ, చూసుకోవాలి కదా జానకి అని అంటుంది. అప్పుడు మల్లిక, ఏంటి ఇంతే తిట్టారా అని అనుకోని, పోనీలే తిట్లు పోయిన జానకి చదువుకునే సమయం వృధా అయ్యింది ప్రస్తుతానికి ఇది చాలు అని అనుకుంటుంది.
 

 అప్పుడు జానకి  కింద పడిపోయిన తులసికోటలో ఉన్న మట్టిని ఏరుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకికి మట్టిలోక ఉంగరం దొరుకుతుంది. అత్తయ్య గారు ఇదేదో ఉంగరం లా ఉన్నట్టున్నది అని ఇస్తుంది. దాన్ని గోవిందరాజు పరిశీలించి ఆనందపడి, జ్ఞానం ఇది గుర్తున్నాదా మన పెళ్లయినప్పటి మొదటి ఉంగరం చాలా రోజుల తర్వాత దొరికింది అని సంబరపడతాడు.దాన్ని చూసిన జ్ఞానం కూడా అప్పటి ఉంగరం దొరికింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది.దాన్ని చూసి మల్లిక అవాక్కవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!