పరీక్షలు అయ్యేవరకు మనసులో ఇంకేం పెట్టుకోవద్దు అని చెప్పాను అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, ఇప్పటివరకు నువ్వ మాట్లాడింది చదువు గురించ? అని అంటారు ఇంతట్లో గౌతమ్ ఈ పని ఇంక ఎలా లేదు అనుకొని అక్కడ నుంచి నిరాశ వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి మహేంద్ర తో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కానీ వాసుదారిని ప్రస్తుతానికి చదువుకోనిద్దాము వసుధారా మనకు దొరికిన అదృష్టం దాన్ని ఎలా వదులుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో పుష్ప, వసు ఇద్దరు నడుస్తూ ఉండగా పుష్ప పరీక్షలకి ఏవైనా టిప్స్ చెప్పు వసు అని అడుగుతుంది.