ఈరోజు ఎపిసోడ్ లో మోనిత వాడేదో చేస్తే నువ్వు అనుమానిస్తున్నావు కార్తీక్ నాకు పిచ్చెక్కుతోంది. దంతుని నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అని టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుతుంది మోనిత. అప్పుడు కార్తీక్ చేతులు పట్టుకొని నిజంగా ఆ దుర్గకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ వంటలక్క పంపించింది నమ్ము కార్తీక్ అని అంటుంది. అయితే నిజంగా ఆ వంటలకే దుర్గని పంపించింది అంటావు అనగా అవును కార్తీక్ అనడంతో తనకు ఏంటి లాభం, నేను వంటలక్కతో మాట్లాడితే నీకు కోపం వస్తుంది మరి నీకంటే తనకు ఎందుకు కోపం ఎందుకు తనపై శత్రుత్వం ఏం జరుగుతోంది మోనిత చెప్పు అనడంతో నీకు తెలిసిందే కదా కార్తీక్ నువ్వు నన్ను అనుమానించి వదిలేస్తే నిన్ను ఆ వంటలక్క సొంతం చేసుకుందామని అలా ప్రయత్నాలు చేస్తోంది అని అంటుంది మోనిత.