Guppedantha Manasu: తల్లికే వార్నింగ్ ఇచ్చిన రిషి.. శృతి మించిన శైలేంద్ర శాడిజం!

Published : May 18, 2023, 10:10 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. సమస్యల వలయం నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Guppedantha Manasu: తల్లికే వార్నింగ్ ఇచ్చిన రిషి.. శృతి మించిన శైలేంద్ర శాడిజం!

ఎపిసోడ్ ప్రారంభంలో ఇక్కడే బాగుంది కాసేపు ఇక్కడే ఉందాము అంటూ శైలేంద్ర ఫోన్  చేసినా కూడా పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు రిషి, వసుధార. శైలేంద్ర మళ్లీ ఫోన్ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. ఎక్కడ ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతాడు శైలేంద్ర.
 

210

సిటీకి దూరంగా ఉన్నాము 10 నిమిషాల్లో బయలుదేరుతాము అంటాడు రిషి. త్వరగా రండి మీకోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. రిషి అనవసరంగా తను ఉన్న ప్లేస్ చెప్పాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అంటూ కంగారుపడుతుంది జగతి. మరోవైపు వసుధార నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
 

310

 నువ్వు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అంటాడు రిషి. ఇంట్లో పరిస్థితులే ఆనందంగా ఉండనివ్వడం లేదు అని మనసులో అనుకుంటుంది వసుధార. మరోవైపు శైలేంద్ర ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ నిలదీస్తుంది జగతి. నేనేదో నా బిజినెస్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను అంటాడు శైలేంద్ర.
 

410

నిజం చెప్పు శైలేంద్ర అంటూ టెన్షన్ గా అడుగుతుంది జగతి. అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.. అంటూ కేకలు వేస్తుంది. అంటే రిషి వాళ్ళు ఇంకా రాలేదు అంటూ భయంగా చెప్తుంది జగతి. దానికి నా కొడుకు ఏం చేస్తాడు అంటుంది దేవయాని. అంతలో రిషి వాళ్ళు రావడం చూసి  అదిగో నీ కొడుకు వచ్చాడు వెళ్లి చూసుకో అంటుంది దేవయాని.
 

510

రిషి వాళ్ళు లోపలికి వచ్చేసరికి కోపంతో వసు మీద కేకలు వేస్తుంది జగతి. మీరు తనని ఎందుకు అంటారు తనని బయటికి తీసుకెళ్ళింది నేను అయినా మీరు మా గురించి కాస్త ఆలోచించడం తగ్గించండి మీ పద్ధతి  ఏమీ బాగోలేదు అయినా వసుధారని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను అంటూ తల్లిని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.

610

వసుధారని కోపంగా తన గదికి లాక్కు వెళ్తుంది జగతి. టెన్షన్ తో చచ్చిపోతున్నాను వసు.. అక్కయ్యే అనుకుంటే అక్కయ్యని మించి శైలేంద్ర ప్రమాదకరంగా ఉన్నాడు అంటూ భయంగా చెప్తుంది జగతి. మీరు ఆయన అన్న మాటలకి బాధపడుతున్నారేమో అనుకున్నాను కానీ మీరు సార్ గురించే ఆలోచిస్తున్నారు అంటుంది వసుధార.
 

710

నా ప్రవర్తన వల్లే వాడు అలా అన్నాడు అందులో వాడి తప్పు ఏమీ లేదు అంటుంది జగతి. మరోవైపు శైలేంద్ర దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి డ్రామా ప్లే చేస్తున్నావు జగతి టెన్షన్తో భయపడి చస్తుంది నువ్వు లేనప్పుడు నేను ఒక మాట అంటే తను రెండు మాటలు అనేది. వాళ్లని నేను మానసికంగా భయపడలేకపోయాను కానీ నువ్వు ఆ పని చేశావు అంటూ కొడుకుని మెచ్చుకుంటుంది  దేవయాని.
 

810

అవసరం అయితే రిషి ని అడ్డు తప్పించి అయినా నీ కోరికని నేను తీరుస్తాను మమ్మీ  అంటూ మాటిస్తాడు శైలేంద్ర. ఈ మాటలు విన్న ధరణి కంగారు పడిపోతుంది ఈ విషయాన్ని ఎలాగైనా రిషికి చెప్పాలి వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నాడు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్తున్నప్పుడు పడిన నీడని చూసి ఎవరో అక్కడనుంచి వెళ్లారు అని గమనిస్తారు తల్లి కొడుకులు.
 

910

 ధరణి కంగారుగా కిందికి దిగుతుంటే రిషి కనిపిస్తాడు. నీకు ఒక మాట చెప్పాలి అంటూ ఏదో మాట్లాడబోతుంది ధరణి. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటూ సడన్ గా అక్కడికి వచ్చేస్తాడు శైలేంద్ర. ఏంటి అన్నయ్య ఏమైనా ప్రాబ్లమా? వదిన ఎందుకు అంత కంగారుపడుతుంది అంటాడు రిషి. ఏమీ లేదు మీరు బయటికి వెళ్లారు కదా మీకోసం వంట చేయలేదు చెప్పటానికి కంగారుపడుతుంది అంటాడు శైలేంద్ర.
 

1010

ఈ మాత్రానికే ఎందుకు అంత కంగారు వదిన.. మేము బయట భోజనం చేసేసాము మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. నీకు ఎక్కడ ఏవి చెప్పొద్దు అని హెచ్చరించిన పట్టించుకోవడం లేదు ఇకమీద మా విషయాలు ఎక్కడైనా చెప్పాలి అని ప్రయత్నిస్తే రిషి వాళ్ళ కన్నా ముందే నువ్వు జనాభా లెక్కల్లో లేకుండా పోతావు అంటూ భార్యని హెచ్చరిస్తాడు శైలేంద్ర. మరోవైపు డాబా మీద ఉన్న రిషి వసుధారకి  ఫోన్ చేయాలి అనుకుంటాడు. అంతలో వసుధర  కిందన గార్డెన్లో ఒంటరిగా కూర్చోవడం చూసి ఆమె దగ్గరికి బయలుదేరుతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories