సీరియల్ ప్రారంభంలోనే జగతి, మహేంద్ర, గౌతమ్, వసుధర లు భోజనం తినటం కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. కానీ రిషి మాత్రం ఏ సంబంధం లేనట్టు పక్కన నిలబడి ఉంటాడు. ఇది చూస్తున్న జగతి రిషి కోసం బాధపడుతూ ఉంటుంది. జగతి బాధపడటం చూసిన వసుధార రిషి సార్ కి నేను భోజనం పెడతాను మేడం అంటూ భోజనాన్ని తీసుకెళ్తుంది.