ఈరోజు ఎపిసోడ్ లో పుష్పకీ ఫోన్ రావడంతో మాట్లాడానికి బయటకు వెళుతుంది. అప్పుడు రిషి(rishi), వసు కీ గులాబీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆల్ ది బెస్ట్ చదువుల పండుగ సక్సెస్ కావాలి అని వసుకు మెసేజ్ చేస్తాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు వసు(vasu), రిషి ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ ఇప్పుడు దగ్గర అవుతారో అని అనుకుంటూ ఉంటారు.