Karthika Deepam: అమ్మ నాన్న రావాలి.. శౌర్య కోరిక తెలుసుకొని కుమిలిపోతున్న హిమ!

Published : Jul 22, 2022, 08:04 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
15
Karthika Deepam: అమ్మ నాన్న రావాలి.. శౌర్య కోరిక తెలుసుకొని కుమిలిపోతున్న హిమ!

 ఈరోజు ఎపిసోడ్ లో పూజారి మీరు ఏదైనా కోరిక అనుకొని చీటీ రాసి ఆ హుండీలో వేస్తే ఎప్పటికప్పుడు అవి అమ్మవారి దగ్గర పోస్తాము అని అంటాడు. అప్పుడు ప్రేమ్(pream)తప్పకుండా కోరికలు తీరుతాయా పూజారి గారు అని అడగగా తప్పకుండా తీరుతాయి అనడంతో అక్కడున్న వారందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సౌందర్య(soundarya) ఫ్యామిలీ వాళ్లు వెళ్లి చీటీ రాసి అందులో వేస్తారు.
 

25

 అప్పుడు సౌందర్య, సౌర్య(sourya)ని వెళ్లి కోరిక రాయమని అడగగా అప్పుడు సౌర్య నిరుపమ్ ని చూసి నా కోరికలు ఎప్పుడో ఆవిరి అయ్యాయి అని అంటుంది. ఆ తర్వాత సౌర్య కూడా వెళ్లి కోరిక రాసి అందులో చీటీ హుండీలో వేస్తుంది. ఆ తర్వాత సౌందర్య,సౌర్యని తీసుకొని గుడిలోకి వెళ్ళగా అప్పుడు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రేమ్ అక్కడే నిలబడగా అప్పుడు హిమ(hima )నాకు ప్రసాదం తీసుకునిరా అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ్ పంపించి ఆ తర్వాత సౌర్య రాసిన చీటీని చదువుతుంది.
 

35

 అందులో సౌర్య(sourya) అమ్మానాన్న రావాలి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత హిమ, సౌర్య దగ్గరికి మాట్లాడడానికి వెళ్లగా సౌర్య అనవసరంగా హిమపై కోప్పడుతుంది. అప్పుడు హిమ, నీకు నిరుపమ్ బావకీ మధ్య ఎవరు రాకుండా నేను చూసుకుంటాను మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను అని అనగా సౌర్య కోపడుతతూ హిమను కొట్టడానికి చేయి లేపుతుంది. మీ నిరుపమ్(nirupam) బావ వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా కూడా నేను చేసుకోను వెళ్ళిపోతుంది.
 

45

ఆ తరువాత నిరుపమ్, ప్రేమ్(pream) ఇద్దరు సౌర్య విషయంలో మాట్లాడుకుంటూ పోట్లాడుతూ వెళుతూ ఉంటారు. ఆ తరువాత సౌందర్య, ఆనంద్ రావ్ లు ఇద్దరూ మళ్లీ సౌర్య,హిమలను కలపడానికి ప్లాన్ వేస్తారు. అప్పుడు వారిద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ కారు ఆటో టైర్లలో గాలి తీసేస్తారు. ఆ తరువాత ఏమి తెలియనట్టుగా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సౌర్య(sourya) వచ్చి ఆటో పంచర్ అయింది అని అనుకుంటూ ఉంటుంది.
 

55

 ఆ తరువాత సౌందర్య(soundarya) అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు స్వప్న,ప్రేమ్ లైఫ్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి శోభ వస్తుంది. మరోవైపు నిరుపమ్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శోభ వచ్చి నిరుపమ్ కాఫీ షాప్ కి పిలుచుకొని వెళ్తుంది. ఆ తర్వాత హిమ హాస్పిటల్ కి బయలుదేరగా ఆనందరావు బాగాలేదు అని యాక్ట్ చేస్తాడు. రేపటి ఎపిసోడ్లో ప్రేమ్,హిమ(hima) లు ఎలా అయినా నిరుపమ్, సౌర్యలను కలపాలి అనుకుంటారు. తర్వాత నిరుపమ్, సౌందర్య ఇంటికి రావడంతో నిరుపమ్ ని చూసి సౌర్య బయటకు వెళ్ళిపోతుంది.

click me!

Recommended Stories