Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వసు తో పాటు గౌతమ్ (Gautham) కూడా తన ఇంట్లో వాళ్ళను పరిచయం చేసుకోవాలని వెళ్తుండగా అప్పుడే జగతి, మహేంద్ర వర్మ (Mahendra) బయటికి వస్తారు. వాళ్ళను చూసి ఈ ముగ్గురు షాక్ అవటంతో గౌతమ్ మహేంద్ర వర్మ ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతాడు.
29
అప్పుడే రిషి (Rishi) మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఈ సమయం వరకు ఉండి డిస్కస్ చేయాలా అంటూ కవర్ చేస్తాడు. మహేంద్రవర్మ తడబడుతూ అక్కడి నుంచి బయటపడతాడు. ఇక రిషి కారు లో కూర్చొని గౌతం (Gautham) తో మాట్లాడతాడు.
39
వసుధార (Vasudhara) అక్కడినుంచి లోపలికి వెళ్లి పోతుంది. ఇక రిషి ఒంటరిగా నిల్చొని వసు ఎందుకిలా ప్రవర్తిస్తోంది అనుకుంటూ.. పెద్దమ్మకు సారీ ఎందుకు చెప్పట్లేదు అని తన గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ (Gautham) వచ్చి రిషికి ఇష్టమైన మ్యూజిక్ వాయించేది గిఫ్ట్ ఇస్తాడు.
49
గౌతమ్ కాసేపు తనను మ్యూజిక్ ప్లే చేయమని చెబుతాడు. రిషి (Rishi) ఇప్పుడు వద్దని అనడంతో గౌతమ్ ను బ్రతిమాలతాడు. పాత జ్ఞాపకాలను తలచుకొంటూ పాడమని అనడంతో వసుతో (Vasu) గడిపిన క్షణాలను తలుచుకొని మ్యూజిక్ ప్లే చేస్తాడు.
59
మహేంద్రవర్మ (Mahendra) ఆ మ్యూజిక్ విని ఇది ఏదో బాధలో ఉన్న మ్యూజిక్ అంటూ బాధ పడతాడు. ఇక ఉదయాన్నే ధరణి దగ్గరికి వెళ్లి రిషి కి నిజం చెప్పమని అనటంతో ధరణి (Dharani) షాక్ అవుతుంది. నేను చెప్పలేను మామయ్య అంటూ భయపడుతుంది.
69
అప్పుడే రిషి (Rishi) రావడంతో షాక్ అవుతారు. రిషి తమ మాటలు విన్నాడేమో అని భయపడతారు. వసు ఇంట్లో రెడీ అవుతుండగా రిషి కారు హారన్ కొట్టడంతో హడావుడి చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. జగతి (Jagathi) అడ్డుపడి టిఫిన్ చేయమంటుంది.
79
ఇక వసు రిషి (Rishi) సర్ కు ఆలస్యం అయితే కోపం అవుతాడని హడావిడిగా బయటికి వెళ్తుంది. ఇక కారులో ఎక్కి బయల్దేరుతుంది. జగతి వాళ్లను చూసి వీరి మధ్య ఏముందో అర్థం కాదని అనుకుంటుంది. గౌతమ్ మహేంద్రవర్మ (Mahendra) తో ప్రేమ గురించి టాపిక్ తీస్తాడు.
89
ఇక మహేంద్రవర్మ (Mahendra) ప్రేమ గురించి అద్భుతంగా చెబుతాడు. ప్రేమ గురించి విన్న గౌతమ్ మహేంద్ర వర్మను పొగుడుతాడు. రిషి (Rishi) గురించి ఆయన వ్యక్తిత్వం గురించి కాసేపు మాట్లాడుకుంటారు. రిషి, వసు కారులో బయలు దేరుతారు.
99
వసు (Vasu) తన జుట్టు తో ఇబ్బంది పడటం తో రిషి టై కట్టుకోమని సలహా ఇస్తాడు. తరువాయి భాగం లో తన పెద్దమ్మకు సారీ చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. ఇక జగతి తో వసు ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయమని అనడంతో జగతి (Jagathi) షాక్ అవుతుంది.