Guppedantha Manasu: సాక్షికి షాకిచ్చిన రిషీ.. పేపర్ లో వసు, రిషీ ఫోటో చూపించి గోలాగోలా!

Published : Jul 05, 2022, 10:18 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: సాక్షికి షాకిచ్చిన రిషీ.. పేపర్ లో వసు, రిషీ ఫోటో చూపించి గోలాగోలా!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నేను నడుస్తున్న దారిలోకి నువ్వు వస్తున్నావ్.. గుర్తుపెట్టుకో.. రాంగ్ రూట్ లో వస్తున్నావ్ సాక్షి అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ సాక్షి వినకుండా వాదిస్తే.. నువ్వు మారేలా లేవు.. కొందరికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది.. మరికొందరికి రెండు సార్లు చెప్తే అర్థం అవుతుంది.. ముర్ఖులకు మాత్రం ఎలా చెప్పిన అర్థం కాదు అని మా మేడమ్ చెప్పింది అని వసు అంటే..
 

26

నేను ఒకరు చెప్తే వినేదాన్ని కాదు అని అంటుంది. అంతేకాదు నేను ఒకటి అనుకున్నాను.. అది సాధించే వరకు నిద్రపోను.. నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని సాక్షి డైలాగ్ కూడా వేస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఒకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రమాదం అని అంటుంది. ప్రేమ సహజంగా పుట్టాలి.. తెచ్చి పెట్టుకున్నది కాదు అని సాక్షికి వార్నింగ్ ఇస్తుంది. అప్పటికి ఆగకుండా మాట్లాడే సాక్షికి మెడ పట్టి గెంటించాల్సి వస్తుందని సాక్షికి చెప్పి వసు వెళ్ళిపోతుంది.
 

36

ఇంకా క్లాస్ లోకి వెళ్లిన వసుధారకు స్టూడెంట్స్ అందరూ కంగ్రాట్స్ చెప్తారు. అప్పుడు వసుధార రిషీ గురించి ఆలోచిస్తుంది.. సాక్షి వచ్చినప్పుడు తనకు చెప్పాలి అని జగతితో పర్మిషన్ తీసుకోని వెళ్తుంది. మరోవైపు మహేంద్ర కూడా సాక్షి వెళ్లిందని ఏం చేస్తుందోనని చూడటానికి వెళ్తాడు.. ఇంకా పేపర్ లో ఫోటో చూపించి ఏంటిది అని వసు సీరియస్ లుక్ ఇస్తుంది.
 

46

అప్పుడే క్లాస్ రూమ్ లోకి వసు ఎంట్రీ ఇస్తుంది.. చెప్పు వసుధార పని ఏంటో అని అంటే.. రిషీ ముందు నేను వచ్చాను అని సాక్షి అంటుంది. ముందు ఎవరు వచ్చారు అనేది కాదు.. ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళతో వర్క్ అంటాడు.. ఆ మాటలు సాక్షికి మండిపోతుంది.. అతర్వాత చూడు ఆ పేపర్ లో ఏముందో చూడు అని వసు రిషీకి వేసిన పూలదండ ఫోటో పేపర్ లో వచ్చి ఉంటుంది.
 

56

ఇందులో ఏముంది అని కోపంగా సాక్షి అడిగితే.. ఏది నిజమో అదే కనిపిస్తుంది.. వసు విజయం సాధించింది.. కాలేజ్ తరుపున, బస్తీ వాసుల తరుపున అభినందించము అని రిషీ అంటే ఆమె నీకు పూల దండ వేసినది వచ్చింది అని సీరియస్ అవుతుంది. ఏ ఫోటో వేసిన నాకు ప్రాబ్లెమ్ లేదు.. ఎవరు ఎం అనుకున్న నాకు ప్రాబ్లెమ్ లేదు అని రిషీ ఇచ్చిన సమాధానంకు సాక్షికి మెంటల్ ఎక్కిపోయి సీరియస్ అయ్యి వెళ్ళిపోతుంది.
 

66

ఇక మరో సీన్ లో వసుధారకు సాక్షి వార్నింగ్ ఇవ్వాలని చూస్తే వసు తనకు థాంక్స్ చెప్తుంది. ఇలా వచ్చి పేపర్ ఇచ్చిన నీకు ఎంతో థాంక్స్ అని వసుధార చెప్తుంది. ఇంకా వసు ఆ పేపర్ చూస్తూ బాగుంది కదా.. ఈ ఫొటోలో నేను బాగున్నానా.. రిషీ సర్ బాగున్నారా అని సాక్షిని వసు ఉడికిస్తుంది. థాంక్స్ సాక్షి.. నువ్వు చాలా మంచిదానివి అని సాక్షికి పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు సాక్షికి చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories