Guppedantha Manasu: గుప్పెడంత మనసులో హైలెట్ సీన్.. కౌగిలింతలో మునిగిపోయిన రిషి, వసు?

First Published | Nov 18, 2021, 10:00 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

వసు (Vasu) రిషిని కలుస్తాను అని మారం చేయడంతో రేపు కలవచ్చు అని నచ్చ చెపుతుంది. మహేంద్ర వర్మ  ఏమీ అనకుండా సైలెంట్ గా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. జగతికి (Jagathi) వెంటనే గతంలో మహేంద్ర మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో మహేంద్ర దగ్గరికి వెళుతుంది.
 

మహేంద్ర (Mahendra) బాధ పడుతూ ఉండగా జగతి వచ్చి కోపంతో వీళ్ళ మధ్య ఏం జరుగుతుందని ప్రశ్నిస్తోంది. మహేంద్ర వర్మ తన మనసులో ఒకటి అనుకుంటే మరొకటి అయ్యేలా ఉందని అనుకుంటాడు. జగతి (Jagathi) మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది.
 


రిషి (Rishi), వసుల (Vasu) మధ్య ఏం జరిగిందని అనడంతో మహేంద్ర నాకేం తెలుసు అంటూ తప్పించుకుంటాడు. ఇక జగతి అసలు వదలకుండా గట్టిగా ప్రశ్నించడంతో ఇది చెప్పే సమయం కాదని నచ్చజెప్పి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు.
 

రిషి (Rishi) తను వసుతో మాట్లాడిన మాటలను, వసు మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. అలా ఎలా ఆలోచిస్తాను అనుకోని వసుని బాగా బాధ పెట్టాను అని అనుకుంటూ బాధపడతాడు. వసు (Vasu) ఎలా ఉందో అని తలచుకుంటాడు.
 

వసును (Vasu) ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాను అనుకుంటూ ఇదంతా వసు వల్లే జరిగిందని అనుకుంటాడు. అప్పుడే మహేంద్రవర్మ (Mahendra) రావడంతో రిషి కోపంగా చూస్తూ నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అంటూ మండిపోతాడు.
 

ఇక మహేంద్రవర్మ ఏ రోజు కూడా వసు (Vasu), శిరీష్ (Sireesh) ల పెళ్లి చెప్పలేదు అని కావాలంటే గతంలో మాట్లాడిన మాటలు తలుచుకోమని చెప్పి ఇదంతా నీ తొందరపాటు వల్ల జరిగింది అని ఇదంతా నీ తప్పే అని  మహేంద్రవర్మ అంటాడు.
 

ఇక శిరీష్ (Sireesh) తను ప్రేమించిన అమ్మాయి అమూల్యతో (Amulya) పెళ్లి చేయడానికి తన సహాయం కోరాడని అందుకే అలా చేశాను అని కానీ ఇదంతా నువ్వు ఆలోచించడం విధానంలో తప్పు అని అంటూ గతంలో తాను ప్రవర్తించిన విషయాలన్ని గుర్తు చేస్తాడు.
 

ఇక వసుధార (Vasudhara) ఎవరినైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తాడు మహేంద్ర. ఇక రిషి ఇప్పటికీ తన మనసులో మాట బయటపెట్టకపోయేసరికి మహేంద్రవర్మ (Mahendra) బాధపడతాడు.
 

జగతి (Jagathi) వసుతో ఏం జరిగిందని ప్రశ్నించగా రిషి సర్ శిరీష్ (Sireesh) తో తన పెళ్లి అనుకున్నాడని  అనడంతో జగతి షాక్ అవుతుంది. అలా ఎవరు చెప్పారో తెలియాలి అంటూ చెబుతుంది. జగతి కూడా రిషి వసుల గురించి ఆలోచన లో పడుతుంది.
 

ఇక తరువాయి భాగంలో రిషి (Rishi), వసుల (Vasu) మధ్య హైలెట్ సీన్ నడుస్తుంది. వసు రిషిని గట్టిగా హాగ్ చేసుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. రిషి కూడా వసును కూడా హగ్ చేసుకుంటాడు.

Latest Videos

click me!