Karthika Deepam: కార్తీక్ కోసం మరో స్కెచ్ వేసిన మోనిత.. వంటలక్కతో గొడవలు పడుతున్న డాక్టర్ బాబు?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 18, 2021, 09:37 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతూ మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Karthika Deepam: కార్తీక్ కోసం మరో స్కెచ్ వేసిన మోనిత.. వంటలక్కతో గొడవలు పడుతున్న డాక్టర్ బాబు?

ఈరోజు దీపావళి పండగ సందర్భంగా మోనిత (Monitha) అందంగా రడీ అయ్యి దీపాల కాంతులను చూస్తూ తను ఈ సమయంలో కార్తీక్ తో ఉంటే బాగుంటుందని అనుకుంటుంది. కార్తీక్ (Karthik) తో కలిసి దీపావళి ఎప్పుడు జరుపుకుంటానో అని కలలు కంటుంది.
 

29

అప్పుడే ప్రియమణి (Priyamani) రావటంతో ఆనందరావుని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ కార్తీక్ దగ్గరికి వెళ్తున్నానని ఈరోజు దీపనో (Deepa) లేక తానో అని తేల్చుకోడానికి వెళ్తున్నాను అని అంటుంది. ఇక ప్రియమణి చూపులని బట్టి ప్రియమణి తో కాస్త కోపంగా మాట్లాడుతుంది.
 

39

ఇక తాను గొప్ప ప్రేమికురాలు అంటూ తనను కార్తీక్ (Karthik) మాత్రం అర్థం చేసుకోవడం లేదని.. దీపకు (Deepa) దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చేవాడని భుజంపై వాలి అన్ని విషయాలు చెప్పుకునే వాడని ఇప్పుడు అన్నీ మరిచిపోయి దీప గురించి ఆలోచిస్తున్నాడు అంటూ మండిపోతుంది.
 

49

ఒకప్పుడు తనను బాగా పొగిడేవాడని ఇప్పుడు అలా లేడని దీప, సౌందర్య (Soundarya) ల ప్రేమకు లొంగిపోతున్నాడని కోపంతో రగిలిపోతుంది. కార్తీక్ అమాయకుడని అందుకే దీప (Deepa) మాయలో పడ్డాడని అంటుంది. ఆ మాయలో నుంచి బయటపడటానికి తాడోపేడో తేలుస్తానని అంటుంది.
 

59

మరోవైపు కార్తీక్ దీప (Deepa) మార్పుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. దీపకు నిజం తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోతాడు. దీప మనసులో ఏముందని దీప గురించి ఆలోచిస్తాడు. అంతలోనే మోనిత (Monitha) కొత్త నెంబర్ తో ఫోన్ చేస్తుంది.
 

69

కార్తీక్ (Karthik) ఎవరో అని లిఫ్ట్ చేయగా మోనిత (Monitha) ఓవర్ గా మాట్లాడుతుంది. తనను కలవమని కోరుకుంటుంది. అంతేకాకుండా శ్రీవారు, నాధ అంటూ పిలవడంతో కార్తీక్ నోరుముయ్యి అంటూ అలా పిలవద్దని మండిపోతుంది అని రగిలిపోతాడు.
 

79

మీ ఇంటి వీధి చివరన ఉన్నాను అంటూ ఒకసారి కలవమని అనడంతో కార్తీక్ (Karthik) తనపై గట్టిగా అరుస్తాడు. తను రాను అనేసరికి నేను వస్తాను అంటూ మోనిత (Monitha) షాక్ ఇస్తోంది. ఇక కార్తీక్ మోనిత ఇంటికి వస్తాదన్న భయంతో వెళ్లి తన పని ఏంటో చూస్తాను అని అనుకుంటాడు.
 

89

అంతలోనే దీప (Deepa) వచ్చి సరదాగా మాట్లాడుతుండటంతో కార్తీక్ కు కొత్తగా అనిపిస్తుంది. ఇక తనతో కాసేపు మాట్లాడాలని ఉందని అనడంతో అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది. ఇక భయపడి దీపకు మళ్లీ వస్తానని నచ్చజెప్పి మోనిత  (Monitha) దగ్గరికి బయలుదేరుతాడు.
 

99

మోనిత కూడా కార్తీక్ (Karthik) ఇంటికి బయల్దేరుతుంది. ఇక ఇద్దరు దారి మధ్యలో కలుసుకోవడంతో కార్తీక్ తనపై గట్టిగా అరుస్తాడు. మోనిత మాటలకు రగిలిపోతాడు. మోనిత తన స్టాప్ ని పిలిపించి సెల్ఫీల పురాణం మొదలు పెట్టేలా చేస్తుంది. దీనిని బట్టి చూస్తే మోనిత (Monitha) కార్తీక్ ను దక్కించుకోవడం కోసం ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

click me!

Recommended Stories