Guppedantha Manasu: మరణం అంచున విశ్వనాథం.. భయంతో వణికిపోతున్న ఏంజెల్!

Published : Aug 10, 2023, 07:20 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. అర్హత లేకుండా అధికారం కోసం ఆశ పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu:  మరణం అంచున విశ్వనాథం.. భయంతో వణికిపోతున్న ఏంజెల్!

ఎపిసోడ్ ప్రారంభంలో డాడ్ ఆ ఫోన్ ఏదో నాకే చేయొచ్చు కదా అంటాడు రిషి. బాధలో ఉన్న వాళ్ళు ఓదార్పుని కోరుకుంటారు. మీకు ఫోన్ చేస్తే మీరు చిరాకు పడతారని నాకు చేసి ఉంటారు వాళ్ళ దృష్టిలో మీరు వేరు నేను వేరు కాదు అంటుంది వసుధార. అయితే డాడీ కి చెప్పండి నా గురించి ఈ కంగారు పడొద్దు అని. ఇక్కడ నన్ను కేర్ తీసుకునే వాళ్ళు  ఉన్నారు అని.
 

28

వాళ్లు నాకేమీ కానివ్వరని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటే మీ కోపం లోపల నా మీద ప్రేమ ఉందని తెలుసు అనుకుంటుంది వసుధార. మరోవైపు ప్లాన్ పెగిలినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే అక్కడికి దేవయాని వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. కాస్త లో ఉంటే దొరికిపోయేవాడిని వంటలు జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. ఇప్పుడు నువ్వు ఏమి చేయకు. ఇప్పుడు ఏం చేసినా నువ్వు నీతో పాటు నేను ఇద్దరం దొరికిపోతాము.
 

38

 అందుకని నువ్వు కాలేజీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు అంటుంది దేవయాని. మంచి మాట చెప్పావు అంటాడు ఫణీంద్ర. సడన్ గా తండ్రి మాటలు వినేసరికి తల్లి కొడుకుల ఇద్దరు కంగారు పడతారు మొత్తం వినేశాడేమో అనుకుంటారు. కానీ ఏమీ వినలేదని అర్థం చేసుకుంటారు. అలాగే డాడీ మమ్మీ చెప్పినట్టే వింటాను రేపటి నుంచి కాలేజీకి వెళ్తాను అంటాడు శైలేంద్ర. నువ్వు బాగుపడతానంటే వద్దనే వారెవరు వెళ్లి జగతి దగ్గర వర్క్ నేర్చుకో అంటాడు ఫణీంద్ర.

48

 ఇంతలో మహేంద్ర వస్తాడు. శైలేంద్ర రేపటి నుంచి కాలేజీకి వస్తాడు అని తమ్ముడికి చెప్తాడు. మీ ఇష్టం అన్నయ్య అంటాడు మహేంద్ర. బాబాయ్ రేపు గర్వంగా చూస్తాడు శైలేంద్ర. మరో రిషి పోలీసులు ఫోన్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. లేదు సార్ అవతలివాడు చాలా పక్కాగా ప్లాన్ వేశాడు రెండు సిమ్ములు కూడా ఒకళ్ళ పేరు మీదే ఉన్నాయి.

58

ఆ పేరు ఉన్నవాడు కూడా చనిపోయి చాలా రోజులైంది అయినా ఏమీ కంగారు పడకండి నేను త్వరలోనే పట్టుకుంటాను అంటాడు ఎస్సై. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఇందులో ఏంజెల్ గట్టిగా ఏడిస్తే కంగారు పడి కిందికి వస్తాడు. అక్కడ విశ్వనాథం గుండెపోటుతో బాధపడుతూ ఉంటాడు రిసీవ్ వెంటనే డాక్టర్ ఫోన్ చేయడంతో అతను ఇంటికి వచ్చి విశ్వనాధాన్ని చెక్ చేస్తాడు. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఇకమీదట ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు.
 

68

 చాలా బాధపడుతూ ఉంటుంది ఏంజెల్. విశ్వానికి ఏమీ కాదు కదా అతను తప్పితే నాకు లోకంలో ఎవరూ లేరు అంటూ ఏడుస్తుంది. కంగారు పడకు నాకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు విశ్వనాథం. అయినా ఏడుస్తూ ఉంటుంది ఏంజెల్ ఆమెని ఊరుకోబెట్టే సార్ కి జ్యూస్ తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు రిషి. ఏంజెల్ వెళ్ళిపోయిన తర్వాత రిషి ని పక్కన కూర్చోబెట్టుకొని ఆమె కథంతా చెప్తాడు విశ్వనాథం.
 

78

నా కొడుకు కోడలు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయిన దగ్గర నుంచి తను నా దగ్గర పెరుగుతుంది. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతానని పెళ్లి కూడా వాయిదా వేస్తూ వచ్చింది ఇప్పుడు నా బెంగ అంతా తన గురించే అంటాడు విశ్వనాథం. మీరేమీ కంగారు పడకండి సార్ అని విశ్వనాథానికి ధైర్యం చెప్పి ఏంజెల్ దగ్గరికి వెళ్తాడు. ఏంజెల్ జ్యూస్ కలుపుతూ ఉంటుంది కానీ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తాడు రిషి.
 

88

 నాకు తాతయ్య తప్పితే ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనకు ఏమైనా అయితే నేను భరించలేను అంటుంది. ఆయనకి వచ్చింది చిన్న ప్రాబ్లం దానికి నువ్వు కంగారు పడక్కర్లేదు అంటాడు రిషి. ఆయనకి వచ్చిన ప్రాబ్లం చిన్నదా పెద్దదో నీకు కూడా తెలుసు కానీ నన్ను సముదాయిస్తున్నావు అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories