విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం ఖుషి. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో యువతని ఊపేస్తున్నాయి. ముఖ్యంగా నా రోజా నువ్వే అనే సాంగ్. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో బుధవారం రోజు ఖుషి ట్రైలర్ విడుదల చేశారు.