Guppedantha Manasu: జగతి చీరకు నిప్పు పెట్టమన్న దేవయాని.. బైక్ పై వసుధార, రిషీ!

Navya G   | Asianet News
Published : Feb 24, 2022, 10:08 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్నటువంటి సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు సరికొత్త ట్విస్టుల కొనసాగుతున్న ఈ సీరియల్ లో ఈరోజు ఏం జరగబోతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

PREV
18
Guppedantha Manasu: జగతి చీరకు నిప్పు పెట్టమన్న దేవయాని.. బైక్ పై వసుధార, రిషీ!

ధరణి (Dharani) చీరలను సర్దుతూ ఉంటుంది ఆ చీరలో జగతి చీర ఉండటం చూసి ఇది చిన్న అత్తయ్య గారి చీర అని చూస్తూ ఉంటుంది. అటు పక్కగా వెళ్తున్న దేవయాని (Devayani) ధరణి చేతిలో ఉన్న చీర జగతిది అని గుర్తు పట్టి దీన్ని కాల్చేయి అంటుంది. కానీ ధరణి అత్తయ్య గారు ఇది జగతి అత్తయ్యకి ఇచ్చేద్దాం అంటుంది. 
 

28

కానీ దేవయాని మనసులో ఏదో పెట్టుకుని ఈ చీరని ఏమీ చెయ్యను నాకు ఇచ్చేయ్ అని తీసుకెళ్ళి పోతుంది. ఇక వసుధారా(Vasudhara) క్లాసులోకి ఆవలిస్తూ వస్తుంది.. పుష్ప తనను పలకరించిన నాకు ఈరోజు డల్ గా ఉంది నన్ను ఏమి మాట్లాడించకు అంటుంది. రిషి (Rishi)క్లాస్ చెప్పడానికి వసుధార నోట్ బుక్ ని అడుగుతాడు. 
 

38

క్లాస్ లో ఇంత మంది ఉండగా రిషి సార్ ఏంటో నన్ను అడుగుతారు అని అనుకుంటూ నోట్ బుక్ ని రిషికి(Rishi) ఇస్తుంది. రిషి క్లాస్ చెప్తుంటే వసుధారా నిద్రపోతూ ఉంటుంది. వసుధర నిద్రపోవడాన్ని చూసిన రిషి గట్టిగా వసుధార అని పిలిచి ఏమయింది..? రాత్రి నిద్ర లేదా..? ఏంటి ప్రాబ్లం..? అని అడుగుతాడు వసుధార (Vasudhara) మీరే నా ప్రాబ్లం సార్ అంటుంది. దాంతో రిషి ఇంకా ఏమీ మాట్లాడలేక క్లాస్ కంటిన్యూ చేస్తాడు.
 

48

రిషి క్యాబిన్లో మహేంద్ర, జగతి (Mahendra, Jagathi)షార్ట్ ఫిలిం కోసం మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి మనిద్దరం వెళ్దామా అని అడగగా  జగతి మాత్రం మనిద్దరం  వెళ్ళడం కుదరదు అంటుంది. ఈ లోపు గౌతమ్ వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను అని అడుగుతాడు. ఇక రిషి (RIshi) వచ్చి ఏంటి విషయం అని అడిగితే గౌతమ్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. 
 

58

కానీ జగతి మాత్రం నిజాన్ని చెప్పేస్తుంది. దాంతో గౌతమ్ ను ఇలాంటివన్నీ అవసరమారా అని తిడతాడు రిషి. జగతి షార్ట్ ఫిలిం రెడీ అయింది కదా ఒక్కసారి చూస్తారా అని అడిగితే నేను, వసుధారా  (Vasudhara)  వెళ్లి చూస్తాం మేడం అంటాడు. గౌతమ్ ఎలాగైనా వసుధర,రిషి తో వెళ్లాలి అని ప్లాన్ చేస్తాడు. గౌతమ్, వసుధరను (Vasudhara) కలిసి షార్ట్ ఫిలిం చూడడం కోసం మన ముగ్గురం వెళ్తున్నాము అంటూ అబద్ధం చెప్తాడు. 
 

68

నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను మీరు వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వసుధర, రిషితో గౌతమ్ అన్న మాటలు గురించి చెప్తుంది. రిషి (RIshi) ఎలాగైనా గౌతమ్ నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని వసుధారాను  (Vasudhara) బైక్ పార్కింగ్ చేసే చోట ఉండమని చేప్తాడు. ఇక రిషి తన స్టూడెంట్ ని పంపించి గౌతమ్ బైక్ తాళాలు తీసుకుని, కారు తాళాలు ఇచ్చి పంపుతాడు. 
 

78

ఇక వసుధర,  (Vasudhara) రిషి బైక్ మీద షార్ట్ ఫిలిం చూడడానికి వెళ్ళిపోతారు. రిషి ప్లాన్ ను అర్థం చేసుకోలేని గౌతమ్ కార్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మహేంద్ర, గౌతమ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. గౌతమ్ రిషి, (RIshi) వసుధర కోసం ఎదురు చూస్తున్నాను అంకుల్ అంటాడు. మహేంద్ర వాళ్ళిద్దరూ రారు నాతో పాటు రా నేను డ్రాప్ చేస్తాను అంటాడు. దీంతో రిషి (RIshi) ప్లాన్ కి షాకైన గౌతమ్ ఏమీ చేయలేక మహేంద్ర తో పాటు వెళ్తాడు. 
 

88

ఇక రిషి, (RIshi) వసుధర ఒక చోట బైక్ ని ఆపి నిలబడి ఉంటారు. గౌతమ్, రిషి కి కాల్ చేస్తాడు కానీ రిషి కాల్ కట్ చేస్తాడు. ఎవరు సార్ అని వసుధర అడగగా వేస్ట్ కాల్ అంటాడు. గౌతమ్, మళ్లీ వసుధర కు  (Vasudhara) కాల్ చేస్తాడు. వసుధర కాల్ ఆన్సర్ చేసి మాట్లడుతుంది. రిషికి కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు ఏంటి అంటాడు. వసుధర రిషి వెస్ట్ కాల్ అని కట్ చేసిన విషయాన్ని తొందర్లో చేప్పస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాల్సిందే.

click me!

Recommended Stories