Karthika Deepam: అదిరిపోయే ట్విస్టు.. ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న వంటలక్క?

Navya G   | Asianet News
Published : Feb 24, 2022, 09:13 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఆనందరావు ' తప్పిపోయిన బిడ్డ మన ఇంట్లో చేరడం ఏమిటి?  ఈ విషయం నీకు ఎలా తెలుసు' అని సౌందర్య (Soundarya)  ను అడగగా జరిగినదంతా చెబుతుంది.  

PREV
15
Karthika Deepam: అదిరిపోయే ట్విస్టు..  ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న వంటలక్క?

మరోవైపు సౌందర్య (Soundarya) , ఆనంద్ రావ్ లు బాబు విషయంలో భయ పడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు కార్తీక్ వచ్చి మోనిత బాబుని ఎత్తు కెళ్ళినా సి సి ఫుటేజ్ ను అడుగుతాడు. ఎందుకు కార్తీక్ అని సౌందర్య అడగగా.. బాబును వెతికి తెచ్చి ఇస్తాను అని మోనిత (Monitha) కు మాట ఇచ్చాను  అని అంటాడు. దాంతో సౌందర్యం మరింత షాక్ అవుతుంది.
 

25

తర్వాత సౌర్య (Sourya) , హిమ లు బాబు ను ఆడిస్తూ ఉండగా  మోనిత అక్కడికి వస్తుంది. ఇక మోనిత కు ఏమీ తెలియనట్టు ఆ బాబు ఎవరు అని వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత ముద్దు వస్తున్నాడు అంటూ మోనిత ఎత్తుకుంటూ ఉండగా ఈలోపు దీప (Deepa)  అక్కడకు వచ్చి బాబును లాక్కుంటుంది. 
 

35

అంతేకాకుండా ఆడ శకుని మా ఇంటికి వచ్చింది ఏంటో? అని మోనిత ను అంటుంది. ఆ క్రమంలో దీప, మోనిత పై విరుచుకు పడుతుంది. ఇక దీప (Deepa)  ఈ బాబు మా ఇంటి బాబు అని చెప్పగా.. అవును మీ ఇంటి బాబే అని  మోనిత మనసులో నవ్వుకుంటుంది. అదే క్రమంలో మోనిత (Monitha) 'నువ్వు ఎన్ని చెప్పినా నా బిడ్డకు కార్తికె తండ్రి' అని అంటుంది.
 

45

అంతేకాకుండా ఆ తండ్రి ప్రేమే కార్తీక్ (Karthik)  తో బిడ్డను వెతికి ఇస్తుంది అని మోనిత అంటుంది. ఆ తర్వాత హిమ, సౌర్య లు బాబు ను ఆడిస్తూ ఉంటారు. ఈలోపు అక్కడకు సౌందర్య వచ్చి ఎప్పుడు చూసినా తమ్ముడు తమ్ముడు అంటున్నారు ఏంటే..అని దీపను అంటుంది. ఇదే క్రమంలో ఎప్పుడైనా దీపు (Deepu)  గాడిని గంటసేపు ఎత్తుకున్నారా అని అడుగుతుంది.
 

55

 దాంతో హిమ (Hima).. వీడే సొంత తమ్ముడు అని అంటుంది. ఆ తరువాత దీప బయటకు వెళ్తూ ఉండగా కోటేష్ డైరీలో రాసిన నెంబర్ తో ఉన్న కారును చూస్తుంది. ఇక ఆ కారు మోనిత కారు అన్న సంగతి తెలుసుకుంటుంది. అంతే కాకుండా ఆ బూబు మోనిత (Monitha)  బాబు అని కూడా తెలిసి పోతుంది ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

click me!

Recommended Stories