వసు జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారంటూ జగతికి రిషీ వార్నింగ్?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 02, 2021, 10:12 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్  రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. మంచి కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
వసు జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారంటూ జగతికి రిషీ వార్నింగ్?

కాలేజ్ లో క్లాస్ రూమ్ లో వసు (Vasu) తన ఫ్రెండ్ తో మాట్లాడుతుండగా అప్పుడే రిషి (Rishi) క్లాస్ చెప్పడానికి లోపలికి వస్తాడు. ఇక తను వసు ని చూసేసరికి శిరీష్ తో జరిగిన ఎంగేజ్మెంట్ గుర్తుకు రావడంతో ఈ మూడ్ ఆఫ్ వల్ల క్లాస్ చెప్పలేనని బయటికి వెళ్తాడు.
 

29

వెంటనే వసు (Vasu) అడగటంతో మళ్ళీ లోపలికి వచ్చి వసు కోసం చెప్పినట్లు అవుతుందని నో క్లాస్ అని బోర్డుపై రాస్తాడు. వెంటనే అందరు సర్దుకొని లైబ్రరీ కి వెళ్తారు. ఇక వసు ని ఆపి లైబ్రరీలో బుక్స్ ఉన్నాయని వెళ్లి తీసుకురా అని పంపిస్తాడు రిషి( Rishi).
 

39

 ఇక లైబ్రరీలో వసు (Vasu) రిషి (Rishi) సార్ బుక్స్ ఇవ్వమన్నాడు అని అనేసరికి లైబ్రరీ లో ఉన్నా సార్ బుక్స్ లేవని  రిషి సార్ తీసుకున్నాడు అని చెప్పటంతో వసు ఆలోచనలో పడుతుంది. బుక్స్ తీసుకున్నాక కూడా ఎందుకు పంపించాడు అని ఆలోచిస్తుంది.
 

49

 అలాగే ఆలోచిస్తూ మౌనంగా వెళ్లడంతో రిషి లైబ్రరీకి వెళ్ళి ఉందేమో అని అనుకుంటాడు. మహేంద్ర వర్మ (Mahendra) రిషి ని తలుచుకుంటూ వస్తుంటాడు. పొగరు ఎవరు అని  అనుకుంటాడు. వెంటనే వసు (Vasu) రావటంతో పొగరు అని పిలుస్తాడు. ఇక వసు ఏమనకపోయేసరికి ఆలోచిస్తాడు.
 

59

రిషి (Rishi) నిన్ను ఏమని పిలుస్తాడని అడుగుతాడు. ఇక రిషి తనను ఎలా పిలుస్తాడో చేసి చూపిస్తుంది వసు. వెంటనే వసు (Vasu) మాటలకు గట్టిగా నవ్వుకుంటాడు. ఇక గురుదక్షిణ గురించి ఏమైందని అడిగేసరికి మర్చిపోలేదు అని సమాధానం ఇస్తుంది.
 

69

ఇక జగతి (Jagathi) రిషి దగ్గరికి వెళ్లి కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి వేరే కాలేజ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పగా వెంటనే రిషి తనను పొగుడుతాడు. కానీ ఇదంతా కాలేజీలో మాత్రమే అని వసు (Vasu) పెళ్లి గురించి టాపిక్ తీసి తనతో కోపంగా మాట్లాడుతాడు.
 

79

అప్పుడే లోపలికి వసు రావటంతో  జగతి బయటికి వెళ్తుంది. ఇక రిషి (Rishi) కి తన పక్కన శిరీష్ (Sireesh) ఉన్నట్లు అనిపించటంతో ఇక్కడినుంచి వెళ్ళండి అని అరుస్తాడు. వసుకి అర్థం కాకపోయేసరికి ఏమైంది సార్ అని ప్రశ్నించగా మళ్ళీ రిషి కోపంతో పెన్ పడేస్తాడు.
 

89

అది వసుకి (Vasu) తగలడంతో వెంటనే వసు దగ్గరికి వచ్చి ఓదార్చుతాడు. వెళ్లి రెస్ట్ తీసుకోమని అంటాడు. వసు మాట్లాడటానికి ప్రయత్నించగా ఎవరితో ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడి అక్కడి నుంచి వసుని వెళ్లేలా చేస్తాడు రిషి (Rishi).
 

99

 జగతి మహేంద్రవర్మ (Mahendra) దగ్గరికి వెళ్లి రిషి ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. ఇక మహేంద్రవర్మ ఏమనకుండా తనలో తాను మనసులో మాట్లాడుకుంటాడు. తరువాయి భాగంలో వసు తను రింగు పడేసుకోవడంతో రిషి (Rishi) తనపై కోపంగా అరుస్తాడు.

click me!

Recommended Stories