తనని పడేద్దామనుకుంటున్నాడంటూ టీమ్‌ లీడర్‌పై రోజాకి `జబర్దస్త్` వర్ష కంప్లైంట్‌.. కుప్పిగంతులపై రోజా సెటైర్లు

Published : Nov 01, 2021, 06:50 PM ISTUpdated : Nov 01, 2021, 06:55 PM IST

`జబర్దస్త్` వర్ష.. తన టీమ్‌ లీడర్‌ బండారాన్ని బయటపెట్టింది. తనకు లైనేస్తున్నాడంటూ జడ్జ్ రోజా ముందు వాపోయింది. పడేద్దామనుకుంటున్నాడని స్టేజ్‌ పైనే చెప్సేసింది. దీంతో రోజా సైతం షాక్‌ కి గురయ్యింది. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది.   

PREV
17
తనని పడేద్దామనుకుంటున్నాడంటూ టీమ్‌ లీడర్‌పై రోజాకి `జబర్దస్త్` వర్ష కంప్లైంట్‌.. కుప్పిగంతులపై రోజా సెటైర్లు

`జబర్దస్త్`(Jabardasth show) ఎంతోమంది ఇంటిల్లిపాదిని అలరిస్తుంది. కామెడీని పంచుతుంది. ఈ షో ఎంతో మంది కమెడీయన్లని తయారు చేస్తుంది. వారికి లైఫ్‌ ఇస్తుంది. అందులో భాగంగా ఈ షోతో పాపులర్‌ అయిన లేడీ కమెడీయన్‌ `జబర్దస్త్` Varsha. అతి తక్కువ కాలంలో ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అందంతోపాటు అద్భుతమైన కామెడీతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది వర్ష. 
 

27

ఈ షోలో ఇమ్మాన్యుయెల్‌(Immanuel), వర్ష)Jabardasth Varsha)ల మధ్య కెమిస్ట్రీ గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరి జోడి స్టేజ్‌పై పండించే కెమిస్ట్రీ, పంచే కామెడీ ప్రత్యేకమైన అభిమానగణం ఏర్పడింది. ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని, రియల్‌ లైఫ్‌లోనూ వీరిద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారనేంతగా వేదికపై తమ రొమాన్స్ ని రక్తికట్టిస్తూ వస్తున్నారు. 
 

37

తాజాగా ఓ టీమ్‌ లీడర్‌పై కంప్లెయింట్‌ చేసింది. తనని పడేద్దామనుకుంటున్నట్టు తెలిపింది. తనకు లైనేందుకు ట్రై చేస్తున్నాడని జడ్జ్ రోజా(Roja) ముందు వెల్లడించింది. ఆ టీమ్‌ లీడర్‌ బండారాన్ని బయటపెట్టింది. దీంతో అటు రోజా, ఇటు ఆ టీమ్‌ లీడర్‌ సైతం షాక్‌ తిన్నారు. అందరు బిత్తరమోహం వేశారు. యాంకర్ రష్మీసైతం నోరెళ్ల పెట్టడం విశేషం. 
 

47

అయితే ఆ టీమ్‌ లీడర్‌ ఎవరో కాదు భాస్కర్‌. తన టీమ్‌లోకి జబర్దస్త్ వర్ష వచ్చాక రెచ్చిపోతున్నాడని అన్నది రోజా. పర్‌ఫెర్మెన్స్ బాగా చేస్తున్నాడని రోజా అనడంతో `నన్ను పడేద్దామనుకుంటున్నాడేమో. పడను` అని స్పష్టం చేసింది. 
 

57

`జబర్దస్త్` వర్షని చూసి రెచ్చిపోతున్నాడట భాస్కర్‌. అయితే దాన్ని తగ్గించుకోవాలని సెటైర్లు వేసింది రోజా. వర్ష సైతం తాను పడను అని క్లారిటీ ఇచ్చింది. దీంతో భాస్కర్‌ మొఖం వాడిపోయింది. అందరి ముందు గుడ్లు తేలేశాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. అందరిని ఆకట్టుకుంటున్నాయి. 
 

67

అయితే ఇప్పటికీ వర్ష.. ఇమ్మాన్యుయెల్‌ని వదలడం లేదు. ఆయనకు జోడీగానే వేస్తుంది. ఇద్దరు మరోసారి రెచ్చిపోయారు. తనని బయట అంతా శ్రీదేవి మళ్లీ వచ్చిందంటున్నారు అని చెప్పింది వర్ష. దీంతో కుంపిగంతులేస్తూ శ్రీదేవి వద్దకు వెళ్లిన దొరికిందంటున్నారు అంటూ పంచ్‌ వేశాడు ఇమ్మాన్యుయెల్‌. దీంతో షాక్‌ తిన్నది వర్ష. మరోవైపు నూకరాజు కాంబినేషన్‌లోనూ వీరిద్దరు కామెడీ పండించారు. 

77

ప్రస్తుతం ఈ లేటెస్ట్ `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో సోషల్ మీడియాలో,ముఖ్యంగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. అందులోనూ వర్ష, భాస్కర్ పై వచ్చిన సన్నివేశాలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రష్మి యాంకర్‌గా వ్యవహరించే ఈ షోలో రోజా, మనో జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. 

also read: బీచ్‌లో బిగ్‌బాస్‌ హారిక అందాల సయ్యాట.. చూసినోడికి దేత్తడే..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories