కాంతార కంటే ముందు రిషబ్ శెట్టి ఎన్ని హిట్ సినిమాలు తీశాడో తెలుసా?

Published : Oct 07, 2025, 02:45 PM IST

రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతార సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ ను  పొందింది. అయితే కాంతార కంటే ముందు రిషబ్ శెట్టి ఎన్ని హిట్ సినిమాలు చేశాడో తెలుసా? జాతీయ అవార్డు సాధించిన సినిమాలు ఎన్ని? 

PREV
16
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమాలు

రిషబ్ శెట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, దర్శకుడు, రచయితగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కొనసాగుతున్నాడు. రిషబ్  దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను పొందుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం మధ్యలో, రిషబ్ శెట్టి దర్శకత్వంలో మీరు తప్పక చూడాల్సిన సినిమాల గురించి చూద్దాం.

26
రికీ

రికీ, ఇది రిషబ్ శెట్టి ఫస్ట్ టైమ్ డైరెక్ట్  చేసిన కన్నడ సినిమా. ఇందులో ఆయన తమ్ముడు రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. హరిప్రియ ప్రముఖ పాత్రలో  నటించింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఒక సాధారణ అమ్మాయి నక్సలైట్‌గా మారే కథ. ప్రేమను కాపాడుకోవడానికి ప్రియుడు ఏం చేస్తాడో చెప్పే అందమైన కథ. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 

36
కిరిక్ పార్టీ

రిషబ్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో  కిరిక్ పార్టీ ఒకటి.  కాలేజీ జీవితంలో జరిగే సంఘటనలు, కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషన్స్ ను  కలగలిపిన తీసిన  అందమైన కథ. ఈ సినిమాలో రక్షిత్ శెట్టికి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఇది ఒక సూపర్ హిట్ సినిమా.  ఈ సినిమాతోనే రష్మిక మందన్న హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా ప్రస్తుతం జియోసినిమా, హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈసినిమాను మరికొన్ని భాషల్లో రీమేక్ కూడా చేశారు. 

46
Sarkari Hi. Pra. Shale, Kasaragodu

Sarkari Hi. Pra. Shale, Kasaragodu కన్నడ సినిమా, ఎన్నో అవార్డులను  గెలుచుకున్న ఒక అందమైన సినిమా. ఇది సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ పాఠశాలల సమస్యలపై తీసిన మూవీ.  రిషబ్ శెట్టి ఈసినిమాతో స్యూల్ పిల్లల కష్టాలు  కళ్లకు కట్టినట్టు చూపించాడు . ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈమూవీని  సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడవచ్చు.

56
కాంతార

రిషబ్ శెట్టిని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన సినిమా కాంతార. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించారు. ఇది కన్నడ సినిమా కాగా దేశవ్యాప్తంగా  సందడి చేసింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా,  గిరిజన ప్రజల దేవడి గురించి వివరిస్తుంది. గిరిజనులను అప్పటి పెద్ద కుటుంబాలు ఎలా చూశాయో చెబుతుంది. ఈ సినిమాను రిషబ్ శెట్టి 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా ఓవర్ ఆల్ గా  400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

66
కాంతార చాప్టర్ 1

కాంతార చాప్టర్ 1 విడుదలై ఐదు రోజులైంది. రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లోనూ సినిమాకు మంచి ఆధరణ  లభించింది. సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయి. రిషబ్ శెట్టి దర్శకత్వం, నటన ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం థియేటర్లలో కాంతార ఫీవర్ పట్టుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈసినిమా 300 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటేసింది. 1000 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories