కాంతార హీరో రిషబ్ శెట్టి ఉగాది సెలెబ్రేషన్స్, ఆవుల్ని ప్రత్యేకంగా పూజించిన పాన్ ఇండియా స్టార్, వైరల్ ఫొటోస్
నటుడు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ఉగాది జరుపుకున్నారు. పండుగ వేడుకల అందమైన ఫోటోలు ఇవి.
నటుడు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ఉగాది జరుపుకున్నారు. పండుగ వేడుకల అందమైన ఫోటోలు ఇవి.
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి ఉగాది పండుగను జరుపుకున్నారు.
రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి, ముద్దుల పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు.
ప్రగతి శెట్టి, రణ్‌విత్ శెట్టి, రాధ్యా శెట్టి, రిషబ్ శెట్టి సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
రిషబ్ శెట్టి దైవభక్తుడు. సమయం దొరికినప్పుడల్లా గుడులకు వెళ్తుంటారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు.
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఆవు, ఎద్దులకు చెరకు ఇచ్చారు. రిషబ్ గారి అందమైన ఫోటో ఇది. హిందూ సంప్రదాయాలని రిషబ్ శెట్టి ఫ్యామిలీ బాగా పాటిస్తుంటారు.
'కాంతార' సినిమా తర్వాత రిషబ్ శెట్టి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ రిషబ్ శెట్టి ప్రీక్వెల్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు.
రిషబ్ శెట్టి బసవన్నకు నమస్కారం చేశారు. వీలైనంత త్వరగా సినిమాను తెరపైకి తీసుకురానున్నారట. దీని కోసం భారీగా సిద్ధమవుతున్నారు.
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఆయన కథ చూసుకుని సినిమా చేస్తున్నారు.