బెట్టింగ్ యాప్స్ డబ్బుతో హనీమూన్ కి వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. 5 కోట్లతో ఇల్లు, 10 ఎకరాల ల్యాండ్ ?

Published : Mar 30, 2025, 06:14 PM IST

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. రానా, ప్రకాష్ రాజ్, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, విజయ్ దేవరకొండ, సుప్రీతా లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

PREV
15
బెట్టింగ్ యాప్స్ డబ్బుతో హనీమూన్ కి వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. 5 కోట్లతో ఇల్లు, 10 ఎకరాల ల్యాండ్ ?
Anvesh

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. రానా, ప్రకాష్ రాజ్, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, విజయ్ దేవరకొండ, సుప్రీతా లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విష్ణుప్రియ, శ్యామల లాంటి వారు తాము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు. 

25
anvesh

అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఒక్కో సెలెబ్రిటీని టార్గెట్ చేస్తూ వారిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. 

35
Shiva Jyothi

తాజాగా అన్వేష్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ జ్యోతిని టార్గెట్ చేస్తూ వీడియో చేశారు. శివ జ్యోతి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కేవలం ఒక ఏడాదిలోనే రూ 10 కోట్లు సంపాదించింది అని అన్వేష్ ఆరోపించారు. ఒకప్పుడు 8 వేల జీతానికి ఉద్యోగం చేసిన శివ జ్యోతికి ఇప్పుడు హైదరాబాద్ లో 5 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. హైవే పక్కన 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదంతా బెట్టింగ్ యాప్స్ సంపాదన ద్వారా పొందింది అని నా అన్వేష్ అన్నారు. 

45
Shiva Jyothi

బిగ్ బాస్ షో తర్వాత శివ జ్యోతి ఫేమస్ అయింది. దీనితో ఆమెకి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే అవకాశం వచ్చింది. ఆమెకి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇంత భారీ సంపాదన ఉండడంతో శివజ్యోతి ఉద్యోగం కూడా మానేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో తన భర్తతో కలసి ఆమె మాల్దీవులు, దుబాయ్, బ్యాంకాక్ లాంటి దేశాలకు హానీ మూన్ కి కూడా వెళ్ళింది అని అన్వేష్ ఆరోపించారు. 

55
Shiva Jyothi

ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ శివ జ్యోతి మాత్రం జల్సాలు చేస్తోంది అని అన్వేష్ విరుచుకుపడ్డారు. శివ జ్యోతికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కూడా ఉందని అన్వేష్ ఆరోపించారు. 

Read more Photos on
click me!

Recommended Stories