జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా కాదు, ఆ ఫీలింగే లేదు.. అతను మావాడే, కాంతార హీరో ఆసక్తికర వ్యాఖ్యలు 

Published : Sep 17, 2023, 07:22 AM IST

ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

PREV
16
జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా కాదు, ఆ ఫీలింగే లేదు.. అతను మావాడే, కాంతార హీరో ఆసక్తికర వ్యాఖ్యలు 

ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి తారలంతా సైమా ఈవెంట్ లో సందడి చేశారు. 

26

తమిళ, మలయాళీ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు స్టార్స్ సైమా వేడుకల్లో సందడి చేశారు. సైమా అవార్డుల వేడుక రెండవరోజు కూడా ఘనంగా సాగింది. రెండవరోజు కన్నడ సినిమా సత్తా చాటింది. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన కాంతార చిత్రం ఏకంగా 8 సైమా అవార్డులు కొల్లగొట్టింది అంటే ఆ చిత్ర జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

36

కాంతార హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రానికి ప్రత్యేక అభినందన అవార్డు, ఉత్తమ విలన్ అవార్డు, ఉత్తమ నటి క్రిటిస్ అవార్డు, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు ఇలా మొత్తం 8 అవార్డులు దక్కాయి. 

46

హీరో రిషబ్ శెట్టి వేదికపై అవార్డు అందుకుంటూ ఫ్రంట్ రోలో కూర్చుని ఉన్న జూ.ఎన్టీఆర్ తో ఆసక్తికర సంభాషణ సాగించారు. వీరిద్దరూ కన్నడలో మాట్లాడుకోవడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ తల్లి మాతృభాష కన్నడ కావడంతో తారక్ కి ఆ లాంగ్వేజ్ స్పష్టంగా వచ్చు. 

56

రిషబ్ శెట్టి తారక్ కి ఎలా ఉన్నారు సర్ అని అడిగాడు దీనికి తారక్ బావున్నాను మీరెలా ఉన్నారు అని ప్రశ్నించారు. ఇంతలో యాంకర్ కల్పించుకుని మీరు కర్ణాటక కుందాపూర్ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడతారా అని అడిగాడు. తాను ఇంట్లో మా అమ్మతో కన్నడలోనే మాట్లాడతా అని ఎన్టీఆర్ చెప్పడంతో అంతా ఫిదా అయ్యారు. 

66

అనంతరం రిషబ్ శెట్టి మాట్లాడుతూ మీకు డైరెక్టర్ కృతజ్ఞతలు చెప్పే అవకాశం నాకు దక్కలేదు. కిరాక్ పార్టీ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు మీరే ఇచ్చారు. నాకు ఎప్పుడూ ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. మీ అమ్మగారి ఊరు మా ఊరు ఒక్కటే. మీరు ఆంధ్ర వారు అనే ఫీలింగ్ మాకు ఎప్పుడూ లేదు. మీరు మావారే అంటూ రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories