ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్.. ప్రభాస్, రజనీకాంత్ కంటే రిచ్..

Published : Sep 16, 2025, 09:11 AM IST

Brahmanandam : టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్‌గా నిలిచాడు. 1000కి పైగా సినిమాలు చేసి రూ.516 కోట్లకు పైగా నికర ఆస్తి సంపాదించాడు. ప్రభాస్, రజనీకాంత్, రణ్‌బీర్ కపూర్‌ల కంటే ఎక్కువ రిచ్‌గా రికార్డ్ సృష్టించాడు.

PREV
16
ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్

ఇండియా వైడ్ గా ఫేమస్ కమెడియన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు కపిల్ శర్మ. టీవీ షోలు, లైవ్ స్టేజ్ యాక్ట్స్, సినిమా అప్పియరెన్స్‌లతో కపిల్ శర్మ దేశవ్యాప్తంగా పాపులరిటీ సొంతం చేసుకున్నారు. చాలా మంది అతన్ని ‘కింగ్ ఆఫ్ కామెడీ’అని పిలుస్తారు. ఆయననే ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ అని భావిస్తే.. పొరపాటే. వాస్తవం ఏమిటంటే.. కమెడియన్లలోనే కాదు, అగ్రహీరోలు డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువ ఆస్తి ఆయన సొంతం. ఇండియా రిచెస్ట్ కమెడియన్ ఎవరో కాదు. మన టాలీవుడ్ కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ - బ్రహ్మానందం. 

26
టాలీవుడ్ కామెడీ కింగ్

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్, కామెడియన్ బ్రహ్మానందం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న ఘనత బ్రహ్మానందం సొంతం, ఆయన సిల్వర్ సీన్‌పై కనిపిస్తే చాలు.. సినిమా హాల్ లో నవ్వులు పూయాల్సిందే. ఎంతటి బాధలో ఉన్నవాడినైనా ఇట్టే నవ్వించగల మాంత్రికుడు ఆయన. ఇటీవల తన ఆత్మకథ ‘మీ’ ను ఆవిష్కరించారు.

36
లెక్చరర్ నుంచి కామెడీ కింగ్ గా

బ్రహ్మానందం అసలు పేరు కన్నగంటి బ్రహ్మానందం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన మొదట తెలుగు లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎప్పుడూ సినిమాల్లో నటిస్తానని ఊహించని ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా మారింది చిరంజీవి నటించిన 'చంటబ్బాయి' సినిమా. అందులో ఒక చిన్న పాత్రతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం. ఆ సినిమాలో ఆయన చూపించిన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేసింది. ఆ తర్వాత ప్రతి సినిమాతో డిమాండ్ పెరిగి, “సినిమాలో హీరో, హీరోయిన్ తర్వాత కనిపించే పెద్ద ఆస్తి బ్రహ్మానందమే” అన్న అభిప్రాయం ఏర్పడింది. చిన్న రోల్ అయినా, ఒకే ఒక్క డైలాగ్ అయినా ఆయన ఒక్కసారి సీన్‌లో కనిపిస్తే చాలు థియేటర్‌లో నవ్వులు పూయాల్సిందే.

46
40 ఏళ్ల కెరీర్ – వెయ్యికి పైగా సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ‘అహ! నా పెళ్ళంట !’ సినిమాలో ఆయన నటన ఇప్పటికీ లెజెండరీగా గుర్తుంటుంది. “మన్మథుడు”, “దూకుడు”, “రేసుగుర్రం”, “రెడీ” వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు మర్చిపోలేనివి. 40 ఏళ్ల కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ తర్వాత వచ్చే ఫుల్ డిమాండ్ కలిగిన స్టార్ అంటే అది బ్రహ్మానందమే.

56
బ్రహ్మానంద నెట్ వర్త్

టాలీవుడ్‌లో 'కింగ్ ఆఫ్ కామెడీ'గా పేరొందిన ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం 60 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు ₹516 కోట్లు) కూడబెట్టారని డీఎన్ఏ, మనీకంట్రోల్ వెల్లడించాయి. ఇది కేవలం ఇతర కమెడియన్ల కంటే ఎక్కువే కాదు, ప్రభాస్ ( రూ. 300 కోట్లు), రణ్‌బీర్ కపూర్ ( రూ. 350 కోట్లు), రజనీకాంత్ (రూ. 400 కోట్లు) వంటి స్టార్ హీరోల సంపద కంటే కూడా ఎక్కువ.

66
కొనసాగుతున్న హాస్య బ్రహ్మ ప్రయాణం

ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్నా, బ్రహ్మానందం నటనను ఆపలేదు. అయితే, ఇంతకుముందులా కాకుండా సెలక్టివ్ పాత్రల్లోనే నటిస్తున్నారు. బ్రహ్మానందం 40 ఏళ్ల సినీ ప్రయాణం అమోఘం. 1990 - 2000లలో ఆయన డిమాండ్ అగ్రహీరోలతో సమానంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో టాప్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇది ఆయన టాలెంట్, డెడికేషన్, క్రేజీ నిదర్శనం. ఓ లెక్చరర్‌గా సాధారణ ప్రారంభించి, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్‌గా, ఇంకా ఇండియాలో అత్యంత ధనవంతుడైన హాస్య నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు బ్రహ్మానందం .

Read more Photos on
click me!

Recommended Stories