అన్ని భాషల్లో సూపర్ హిట్, హిందీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన మహేష్ మూవీపై ఆర్జీవీ సెటైర్లు

Published : Sep 22, 2025, 07:17 PM IST

మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం వివరిస్తూ ఆర్జీవీ సెటైర్లు వేశారు. 

PREV
15
మహేష్ కి మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కెరీర్ బిగినింగ్ లో మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రూపొందిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ పోషించిన ఓబుల్ రెడ్డి పాత్ర అయితే సినిమాకే హైలైట్. మహేష్ బాబు ఈ చిత్రంలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు.

25
ఒక్కడు సంచలన విజయం

ఒక్కడు మూవీ 9 కోట్ల బడ్జెట్ లో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 25 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఏకంగా 8 నంది అవార్డులు గెలుచుకుంది. అంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఎగబడ్డారు. తమిళం, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లో రీమేక్ చేశారు. రీమేక్ అయిన ప్రతి లాంగ్వేజ్ లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

35
అన్ని భాషల్లో సూపర్ హిట్, హిందీలో మాత్రం..

బెంగాలీలో అయితే కేవలం ఈ చిత్రాన్ని 2 కోట్ల బడ్జెట్ లో నిర్మించగా 18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఒక్క హిందీలో మాత్రం ఒక్కడు మూవీ రీమేక్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఒక్కడు మూవీ రీమేక్ హిందీలో డిజాస్టర్ కావడం పట్ల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెటైర్లు వేశారు. హిందీలో ఈ చిత్రాన్ని తేవర్ పేరుతో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా తెరకెక్కించారు.

45
ఒక్కడు హిందీ రీమేక్ పై ఆర్జీవీ సెటైర్లు

నిర్మాత పైత్యం వల్లే తేవర్ మూవీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది అని వర్మ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఎవరో కాదు.. అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్. ఈ మూవీలో బోనీ కపూర్ చేసిన తప్పులపై ఓ ఉదాహరణ ఆర్జీవీ చెప్పారు. ఒక్కడు మూవీ కథ ఏంటి ? నిస్సహాయురాలైన ఓ అమ్మాయిని విలన్ బారీనుండి హీరో రక్షించి తీసుకువెళ్లడమే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో భూమిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇన్నోసెంట్ గర్ల్ గా నటించింది. ఈ చిత్రంలో నువ్వేం మాయ చేశావో గానీ అనే హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది. పచ్చని పొలాలు, చెట్ల మధ్య ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ద్వారా హీరోయిన్ మనస్తత్వం, ఆమె స్వచ్ఛమైన మనసుని డైరెక్టర్ తెలియజేశారు.

55
అంతా గ్రాండ్ అని సినిమాని ముంచేశారు

కానీ తేవర్ మూవీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ని భారీ సెట్స్ వేసి 500 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించారు. నేను బోనీ కపూర్ ని దీని గురించి అడిగాను. హీరోయిన్ ఇంట్రో సాంగ్ సింపుల్ గా కదా ఉండాలి అని అడిగాను. దీనికి ఆయన బదులిస్తూ.. లేదు.. మన సినిమాలో అంతా గ్రాండ్ గానే ఉంటుంది. బాగా ఖర్చుపెడుతున్నాం. మూవీ కూడా గ్రాండ్ గా ఉంటుంది అని అన్నారు. ఆ ఒక్క సాంగ్ తో కథలోని సోల్ ని మార్చేసినట్లు అవుతుంది. ఇక ఆ మూవీ ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది. అందుకే డిజాస్టర్ అయింది అని వర్మ సెటైర్లు వేశారు.

Read more Photos on
click me!

Recommended Stories