2021 round up:ఈ యేడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్,హిట్స్ లిస్ట్

First Published | Dec 27, 2021, 1:38 PM IST

2021 మరో మూడు రోజులలో కంప్లీట్ అవుతోంది. మొదటి క్వార్టర్ లో అల్టిమేట్ అనిపించే లెవల్ లో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేసి దుమ్ము లేపాయి. కానీ తర్వాత సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు మారిపోయి మళ్ళీ అన్ని థియేటర్స్ మూత బడింది. ఆ తర్వాత మళ్ళీ జులై ఎండ్ నుండి థియేటర్స్ రీ ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అఖండ,పుష్ప లాంటి సినిమాలతో ఈ సంవత్సరం విజియోత్సాహంతో ముగిస్తోంది.

jaathi ratnalu

 
బ్లాక్ బస్టర్స్..

 
JATHI RATNALU: 

ఈ  చిన్న సినిమా భాక్సాఫీస్ దగ్గర తొలి బ్లాక్ బస్టర్ గా నమోదు అయ్యింది. నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన ఈ సినిమా 38 కోట్లు షేర్ వసూలు చేసింది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు.  అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.ఓటీటీ,శాటిలైట్ అన్ని కలిపి నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. 
 

UPPENA:

‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది.  


AKHANDA:  ‘సింహా’, ‘లెజెండ్‌’ త‌ర్వాత బాలయ్య,బోయపాటి క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రమే.. ‘అఖండ’. దీనికి కొబ్బరికాయ కొట్టడంతోనే అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మ‌రింత ఉత్సుక‌త‌ని రేకెత్తించాయి.  ‘అఖండ‌’ అవ‌తారంలో బాల‌కృష్ణ గ‌ర్జన దుమ్ము రేపింది.బాల‌కృష్ణ - బోయ‌పాటి క‌ల‌యిక హ్యాట్రిక్ కొట్టిన‌ట్టింది. దాదాపు 63 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ తెచ్చింది.


PUSHPA:

 పుష్ప ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ 100 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్ట‌డం విశేషం. ఏడు రోజుల్లో అన్ని వెర్ష‌న్లూ క‌లిపి దాదాపు రూ.110 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టాయి. అందులో మేజ‌ర్ షేర్ తెలుగు వెర్ష‌న్‌దే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి ఈ చిత్రం రూ.67 కోట్ల దాకా షేర్ క‌లెక్ట్ చేసింది. ఇందులో నైజాందే మేజ‌ర్ వాటా. ఇక్క‌డ దాదాపు రూ.32 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది పుష్ప‌.


సూపర్ హిట్స్ 
 
VAKEEL SAAB:

పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసారు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. టాక్ బాగానే ఉన్నా కూడా సినిమా కలెక్షన్స్ ఊహించినంత రాకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గడంతో పాటు కరోనా కూడా ఉండటం.  ఈ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 90 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే 85.67 కోట్ల దగ్గర పవన్ ప్రయాణం ముగిసింది. 

KRACK

 KRACK: 
థియేటర్లు రీఓపెన్‌ అయ్యాక వచ్చిన తొలి బిగ్‌ మూవీ ‘క్రాక్‌’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్‌ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్‌ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్‌ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్‌ మహారాజాలోని ఫైర్‌ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

Seetimaarr

SEETIMAAR:
గోపీచంద్ నుంచి సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. థియోటర్ లోనూ అదే పరిస్దితి. క్రాక్ సినిమా తర్వాత సరైన మాస్ సినిమా పడలేదు. ఈ లోటుని తీరుస్తానంటూ ‘సీటీమార్‌’ విజిలేస్తూ మన ముందుకు వచ్చింది.  ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. కానీ, క్రమంగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రూ. 12 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా పది హేను కోట్లు కలెక్ట్ చేసింది!

.

Shyam Singha Roy


SHYAM SINGHAROY:

నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.  భారీ అంచనాల నడుమ డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. పునర్జన్మల కాన్సెప్ట్ ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకోవడమే గాక నాని, సాయి పల్లవి నటన సినిమా మేజర్ అసెట్ అయ్యాయి. 

Zombie reddy

హిట్స్
 
కరోనా క్రైసిస్ లో   జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్‌ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
 

Naandhi
అల్లరి నరేశ్‌ నట విశ్వరూం ‘నాంది’
 8 ఏళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్‌ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది‌. నరేశ్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది.


 ఎబోవ్ యావరేజ్

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్‌ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్‌.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది.

రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రెడ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా మేలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు.

పర్వాలేదనిపించిన ‘రెడ్‌’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్‌ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. 

విజయ్‌ ‘మాస్టర్’ పాఠాలు  
విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్‌ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్‌ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. 

దసరాకి అసలు సిసలు సినిమా సందడి కనిపించింది. మూడు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి... పెళ్లిసందD. పాతికేళ్ల కిందటి ‘పెళ్లి సందడి’ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించడం... అప్పటి సినిమాకి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు నేటి సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం, ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటించడం ఈ సినిమా ప్రత్యేకం.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజై భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతను సంపాదించింది. రిలీజైన తొలి రెండు, మూడు రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు షేర్, సుమారు రూ.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం స్వల్ప లాభాలతో తన జర్నీని బాక్సాఫీస్ వద్ద ముగించే ప్రయత్నం చేసింది.
 

Latest Videos

click me!