Krishna Mukunda Murari: కోడలి తిక్క కుదిర్చిన రేవతి.. ఆఖరి క్షణంలో పొరపాటు చేసిన మురారి?

Published : Jun 14, 2023, 03:01 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కొడుకు కోడలు విడిపోతారేమో అని భయపడుతున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Krishna Mukunda Murari: కోడలి తిక్క కుదిర్చిన రేవతి.. ఆఖరి క్షణంలో పొరపాటు చేసిన మురారి?

ఎపిసోడ్ ప్రారంభంలో రేవతి దగ్గరికి వచ్చి ఈ హోమం ఎంత చేస్తున్నావ్ వదిన అని అడుగుతాడు ప్రసాద్. అలా అడగకూడదు ప్రసాద్ తప్పు అంటుంది రేవతి. సుమలత అడగమంది వదిన భార్య భర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఇలాంటి కామెంట్ చేస్తే మంచిదంట అంటే మురారి వాళ్ళ కాపురం సజావుగా సాగటం లేదా అని అడుగుతాడు ప్రసాద్.

29

అలాంటిదేమీ లేదు అంటుంది రేవతి. అప్పుడే అక్కడికి వచ్చిన మధుకర్ నేను కూడా పీటల మీద కూర్చుంటాను అంటాడు. సరే అంటుంది రేవతి. పంచలు కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వమని తండ్రిని అడుగుతాడు మధుకర్. నేను ఇస్తాను అంటుంది రేవతి. నిజమే నా దగ్గర మా నాన్న దగ్గర డబ్బులు ఎలా వస్తాయి ఆయనకి నాకు వయసులో తప్పితే వేరే తేడా ఏమీ లేదు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు మధుకర్.

39

వాడి మీద కోప్పడతాడు ప్రసాద్. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటుంది రేవతి. మరోవైపు ఒంటరిగా ఉన్న మురారి దగ్గరికి వచ్చిన కృష్ణ మీతో మాట్లాడాలి అంటుంది. అప్పుడే వచ్చిన ముకుంద కృష్ణతో మాట్లాడాలి అంటుంది. అయితే మీరు మీరు మాట్లాడుకోండి నేను వెళ్తాను అంటాడు మురారి. మన ముగ్గురు మధ్యలో దాపరికాలు ఏంటి పర్వాలేదు ఉండు అని చెప్పి కృష్ణని పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది ముకుంద.

49

పెళ్లికి ముందు తన కథంతా చెప్తుంది కృష్ణ. అదంతా ఏసీపి సర్ కి కూడా తెలుసు అంటుంది కృష్ణ. కృష్ణ కూడా ముకుందని అదే ప్రశ్న వేస్తుంది. ముకుందా నిజం చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడతాడు మురారి. ప్రేమించాను అతను ఎక్కడ ఉంటాడు చెప్పను కానీ అంటూ మురారి వైపు వేలు చూపిస్తుంది ముకుంద. ఒకసారిగా టెన్షన్ పడతారు కృష్ణ, మురారి. ఓ.. మా ఏసీపీ సార్ లా ఉంటారా అంటుంది కృష్ణ. అవును అని మాట మార్చేస్తుంది ముకుంద.

59

ఏసీపీ సర్ ని కూడా అడగాలి కానీ నేను అడిగితే బాగోదు అని చెప్పి ముకుందని పక్కకు పిలిచి అడగమని చెప్తుంది కృష్ణ. ముకుంద మురారి దగ్గరికి వెళ్లి నువ్వు ఎవరినైనా పెళ్లికి ముందు ప్రేమించావని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తాడా అని ఇద్దరు టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా అక్కడికి రేవతి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు వెళ్ళండి లోపలికి అని కసురుకోవటంతో ఎవరి మటుకు వాళ్ళు వెళ్లిపోతారు.

69

మరోవైపు మురారి డైరీ రాసుకుంటూ కృష్ణ నిజంగా నా భార్య అయితే బాగుండు తను కనిపించకపోతే ఉండలేకపోతున్నాను అనుకుంటాడు. మరోవైపు హోమంలో కూర్చోవడం ఎసిపి సర్ కి ఇష్టం లేదేమో అనుకొని రేవతి తో నాకు జ్వరంగా ఉందత్తయ్య అని అబద్ధం చెప్తుంది కృష్ణ. అయితే టాబ్లెట్ వేసుకో అంటుంది రేవతి. అది కాదు అత్తయ్య నాకు వేడి పడదు రాషెస్ వచ్చేస్తాయి అందుకే హోమంలో కూర్చోలేను అంటుంది కృష్ణ.

79

అవునా.. మరి ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు అయినా గంటల తరబడి వంట ఎలా చేస్తున్నావు..పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా వెళ్లి రాత్రి ఇచ్చిన చీర కట్టుకొని పూజకి రెడీ అవ్వు. ఇదే విషయం మీ ఆయన కి కూడా చెప్పు తింగరి వేషాలు వేస్తే కాళ్లు చేతులు విరగ్గొట్టి హోమంలో కూర్చోబెడతాను అంటుంది రేవతి. మూతి ముడుచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ.

89

మరోవైపు డైరీ రాసుకుంటున్న మురారి కృష్ణ రావడం చూసి సోఫా కిందన దాచేస్తాడు. హోమంలో కూర్చోవడం నాకు ఇష్టమైనా మీకోసం కూర్చొని అని చెప్పాను అందుకు అత్తయ్య తిట్టారు అంటుంది కృష్ణ. హోమంలో కూర్చోవడం కృష్ణకి ఇష్టం లేదేమో అనుకుంటాడు మురారి. నాకు ఇష్టమని ఇంత ఖచ్చితంగా చెప్పాను కదా పైన ఏం మాట్లాడరేంటి ఆయనకి ఇష్టం లేదేమో అనుకుంటుంది కృష్ణ.

99

తరువాయి భాగంలో హోమంలో కూర్చుంటారు కృష్ణ దంపతులు. ఇదే ఆఖరి ఘట్టం ఇది పూర్తయిపోతే హోమం పూర్తయినట్లే అంటారు పంతులుగారు. అంతలోనే ముకుంద కళ్ళు తిరిగి పడిపోతుంది. హోమం మధ్యలోనే లేచిపోతాడు మురారి.

click me!

Recommended Stories