Krishna Mukunda Murari: ముకుంద ట్రాప్ లో పడుతున్న భవాని.. తోటి కోడలు ప్రవర్తనకి ఆలోచనలో పడ్డ రేవతి!

Published : May 08, 2023, 02:05 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తప్పు తను చేస్తే శిక్ష తన భర్త అనుభవించడాన్ని భరించలేకపోతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Krishna Mukunda Murari: ముకుంద ట్రాప్ లో పడుతున్న భవాని.. తోటి కోడలు ప్రవర్తనకి ఆలోచనలో పడ్డ రేవతి!

ఎపిసోడ్ ప్రారంభంలో సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది భవాని. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి అక్క ఇంత సీరియస్ గా ఉందంటే ఇంట్లో ఏదో జరగబోతుంది. ఇప్పుడిప్పుడే నా కొడుకు కోడలు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈవిడ తీసుకుని నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో అనుకుంటుంది.

210

భయంగానే భవానిని పిలిచి ఎందుకు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు అంటుంది. నీకు తెలియదా ఇంట్లోకి కొత్తగా వచ్చావా ఇంతకీ నీ భయం ఏంటి సూటిగా చెప్పు అంటుంది భవాని. మురారి వాళ్లు మీ మాటకి ఎదురు చెప్పటం తప్పే అంటుంది రేవతి. తప్పు అని ఒప్పుకున్నావ్ కదా ప్రాయశ్చిత్తం తప్పనిసరిగా ఉంటుంది అని కోపంగా చెప్పి రేవతిని అక్కడి నుంచి పంపించేస్తుంది భవాని.

310

మరోవైపు తన గదిలోకి వెళ్లిన భవానికి కృష్ణ కనబడుతుంది. షాక్ అవుతుంది భవాని. మీ అనుమతి లేకుండా మీ గదిలోకి వచ్చినందుకు క్షమించండి. కానీ ఒక్క మాట వినండి అంటుంది కృష్ణ. బయటికి పొమ్మన్నట్లుగా సైగ చేస్తుంది భవాని. వెళ్ళిపోతాను కానీ నేను చేసిన తప్పుకి ఏసీపీ సర్ కి శిక్ష వేయకండి అంటుంది కృష్ణ. ఇంకా మాటలు వినటం ఇష్టం లేనట్లుగా ముకుందని గట్టిగా కేక వేసి పిలుస్తుంది భవాని.
 

410

కంగారుగా అక్కడికి వస్తుంది ముకుంద. తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని ముకుందకు చెప్తుంది భవాని. ఏసిపి సర్ కి శిక్ష వేయొద్దని నువ్వైనా చెప్పు అంటుంది కృష్ణ. నేరుగా తప్పు చేయకపోవచ్చు కానీ నీ మాట విని తప్పు చేశాడు మరొకరైతే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు.అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది ముకుంద.

510

ఇప్పుడు తను ఈ గది నుంచి బయటికి వెళ్లకపోతే నేను అదే చేస్తాను అంటుంది భవాని. ఆ పని చేయకండి నేను లేకపోతే ఏసిపి సార్ తో మాట్లాడటానికి ఎవరూ ఉండరు ఒంటరి అయిపోతారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. మరోవైపు తనకోసం భోజనం తీసుకువచ్చిన కృష్ణ మొహం వాడి పోవడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు మురారి.

610

ఏమీ జరగలేదు అంటూ మాట మార్చేస్తుంది కృష్ణ. మీకు ఇష్టమని చేపల కూర చేశాను అంటుంది. నీకు ఇష్టం ఉండదు కదా అంటాడు మురారి. మీకు ఇష్టం కదా అందుకే చేశాను. మీకు ముల్లు తీసుకోవడం రాదంట కదా నా కొడుకు గొంతులో చేప ముళ్ళు గుచ్చుకుంటే ఊరుకోనంటూ మా అత్తగారు వార్నింగ్ ఇచ్చారు అని నవ్వుతుంది కృష్ణ. తనే ముల్లులు తీసి కొసరి కొసరి భోజనం తినిపిస్తుంది.

710

మరోవైపు భవానికి మందులు వేసి పడుకోబెడుతుంది ముకుంద. నేను చెప్తే చాడీలు అనుకుంటారు కానీ కృష్ణ తెలివితేటలు చూశారా ఇప్పుడు మీరు మాట్లాడిందంతా మురారి కి చెప్పి మీ ఇద్దరికీ మరింత దూరం పెంచుతుంది. మురారిని పూర్తిగా తను గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తుంది  అంటుంది. నీ అంత లోతుగా నేను ఆలోచించలేదు ఇకమీదట ఆలోచిస్తాను అంటుంది భవాని.

810

ఒకవైపు నా కోడలు ఇంత ఆనందంగా ఎందుకు ఉంది కారణం తెలుసుకోవాలి అనుకుంటుంది రేవతి. కానీ కృష్ణతో  మాట్లాడటం చూస్తే తనని కూడా భవాని వేలేస్తుందేమో అని భయపడుతుంది. పెళ్లి చేసుకున్న వాళ్లు బానే ఉన్నారు వద్దు అన్న వాళ్లు కూడా బానే ఉన్నారు మధ్యలో నా కొడుకు కోడలు శిక్ష అనుభవిస్తున్నారు అని బాధగా అనుకుంటుంది రేవతి.

910

మరోవైపు మురారి ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ముకుంద. ఇప్పుడిప్పుడే అత్తయ్య నా మాట వినడం ప్రారంభించారు. సమయం చూసుకొని మీ అగ్రిమెంట్ పెళ్లి గురించి.. మన ప్రేమ గురించి చెప్పేస్తాను అప్పుడు ఇంట్లో బాంబు పేలుతుంది అనుకుంటుంది. తను అనుకున్నట్లయితే జరగాలి అని దేవుడ్ని ప్రార్థిస్తుంది.
 

1010

మరోవైపు ముకుంద మాటలకు అక్కయ్య ప్రభావితం అవుతుందా అని ఆలోచనలో పడుతుంది రేవతి. మురారితో మాట్లాడటం లేనందుకు లోపల ఫీల్ అవుతున్నట్లుగా ఉంది.. అయినా అక్కయ్య పక్క వాళ్ళ మాటలకు ప్రభావితం అయ్యే మనిషి కాదు అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories