RRR రికార్డును బద్దలుకొట్టిన Pushpa 2.. రిలీజ్ కి ముందే 900 కోట్ల బిజినెస్?

First Published | May 8, 2023, 1:21 PM IST

రిలీజ్ కు ముందే Pushpa 2 The Rule బిజినెస్ షాకింగ్ గురిచేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న సీక్వెల్ రూ.900 కోట్లకు పైగా బిజినెస్ చేయనుందని అంటున్నారు. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. గతంలో వచ్చిన ‘పుష్ప’కు సీక్వెల్ ఇది. మైత్రీ మూవీ  మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. Pushpa క్రియేట్ చేసిన సెన్సేషన్ కు Pushpa 2పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.  
 

అయితే, సీక్వెల్ తో అల్లు అర్జున్, సుకుమార్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త  రికార్డులను క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషనల్ మెటీరియల్ ను కూడా విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన Where is Pushpa వీడియోకు ఎంతటి రెస్పాన్స్ దక్కిందో తెలిసిన విషయమే. 
 


తాజాగా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పై షాకింగ్ డిటేయిల్స్ తెలుస్తున్నాయి. ఏకంగా RRR రికార్డులనే బద్దలుకొట్టిందని అంటున్నారు. రిలీజ్ కు ముందే ఏకంగా రూ.900 కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ను దాటేసి మరీ బిజినెస్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
 

ఆర్ఆర్ఆర్ థియేటర్ రైట్స్ ను రూ.550 కోట్లు చేయగా.. పుష్ప2 థియేటర్ రైట్స్ రూ.600  కోట్ల వరకు చేసిందని అంటున్నారు. ఇంకా ఎక్కువకు కూడా పోయే అవకాశం ఉందని టాక్. అలాగే ఓటీటీ రైట్స్ రూ.200 కోట్లు అని తెలుస్తోంది. ఆడియో రూ.65 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.865 కోట్ల పైమాటే వినిపిస్తోంది. 

అల్లు అర్జున్ మ్యానరిజం, పాటలు, యాక్షన్ పరంగా ‘పుష్ప : ది రైజ్’ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో Pushpa2 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో ఉంటుందని అర్థం అవుతోంది. అందుకు తగిన విధంగానే చిత్ర  యూనిట్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లాలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. త్వరలో షూట్ ప్రారంభం కానుంది. చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!